బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కుమార్ సాయి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఎలిమినేషన్ విషయంలో  మోనాల్ తో పోటీపడిన కుమార్ సాయి తక్కువ ఓట్ల కారణంగా హౌస్ నుండి బయటికి రావడం జరిగింది. బిగ్ బాస్ వీక్షకులు ఈ ఎలిమినేషన్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజం ఏదైనా కానీ హౌస్ నుండి నటుడు కుమార్ సాయి ఎలిమినేట్ కావడం జరిగింది. స్టార్ మా మ్యూజిక్ బిగ్ బాస్ బజ్ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తుంది. హౌస్ నుండి ఎలిమినేటైన సభ్యులను గత బిగ్ బాస్ సీజన్ విన్నర్ అయిన రాహుల్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా రాహుల్ సిప్లిగంజ్ నటుడు కుమార్ సాయిని ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో కుమార్ సాయి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. రాహుల్ కుమార్ సాయిని ఓ ప్రశ్న అడిగారు. కమెడియన్ గా వెండితెరపై ఆ స్థాయిలో నవ్వులు పూయించిన మీరు బిగ్ బాస్ హౌస్ లో కనీస ప్రదర్శన ఇవ్వలేక పోయారు, ప్రేక్షకుల అటెంషన్ మీ వైపు తిప్పుకోలేకపోయారు..కారణం ఏమిటని అడుగగా. 


సాయి మాట్లాడుతూ...వెండితెర వేరు...బిగ్ బాస్ హౌస్ వేరు. అక్కడ ఎప్పుడూ ఎదో ఒక టెన్షన్ అనుభవించాల్సి వస్తుంది. దానికి తోడు నేను వైల్డ్ కార్డు ఎంట్రీ కావడం వలన ఇంటి సభ్యులు నన్ను స్నేహితుడిగా స్వీకరించలేదు. అప్పటికే మిత్రలుగా మారిన ఇంటి సభ్యులు నన్ను దూరం చేశారు. దానితో బిగ్ బాస్ హౌస్ లో నేను సపరేట్ అన్న భావన కలిగేది. అందుకే నేను కామెడీ చేయలేక పోయాను అని కుమార్ సాయి వివరణ ఇచ్చారు. 

ఇక కుమార్ సాయి ఎలిమినేషన్ పై నెటిజెన్స్ మరియు బిగ్ బాస్ వీక్షకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మోనాల్ ఎలిమినేట్ కావాల్సి ఉండగా కుమార్ సాయిని బలిచేశారని అంటున్నారు. కుమార్ సాయికి ఓట్లేసిన ప్రేక్షకులు మోనాల్ కంటే తనకు తక్కువ ఓట్లు వచ్చే అవకాశం లేదని అంటున్నారు. తాజా ఆరోపణలు బిగ్ బాస్ షోపై ప్రతీకూల అభిప్రాయాలను ఏర్పరుచుతున్నాయి.