ఆస్కార్ వేదికపై చంద్రబోస్ మాట్లాడకపోవడానికి కారణం ఇదా.? అందుకే ‘నమస్తే’తో సరిపెట్టాడు..

ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే.  అయితే ఆస్కార్ వేదికపై చంద్రబోస్ ఏమాత్రం స్పీచ్ ఇవ్వకపోవడం వెనుక అసలు కారణం ఏంటనేది అందరి సందేహం. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది.

This is the reason why Chandra Bose did not speak on the Oscar stage

‘ఆర్ఆర్ఆర్’తో  ప్రతిష్టాత్మక ‘ఆస్కార్’ అవార్డును దక్కించుకొని ప్రపంచ దేశాలు ఇండియన్ సినిమా వైపు చూసేలా చేశారు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఈ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ నుంచి సెన్సేషనల్ సాంగ్ ‘నాటు నాటు’కు సినీ అవార్డుల్లోనే అత్యుత్తమమైన ఆస్కార్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే.  మార్చి 13న అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో గల డాల్బీ థియేటర్ లో 95వ ఆస్కార్ వేడుక అట్టహాసంగా జరిగింది. వేదికపై ‘నాటు నాటు’ పాట లైవ్ మ్యూజిక్ పెర్ఫామెన్స్ తర్వాత ఆస్కార్ ను ప్రకటించారు. వేదికపైకి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (MM Keeravani) మరియు  ప్రముఖ లిరిసిస్ట్ Chandra Bose వెళ్లి అవార్డును స్వీకరించారు. 

ఆస్కార్ వేదికపై అవార్డును అందుకున్న తర్వాత కేవలం ఎంఎం కీరవాణి మాత్రమే మాట్లాడారు. చంద్రబోస్ అవార్డును చూపిస్తూ తన ఆనందాన్ని వ్యక్త పరిచారు. ఎంఎం కీరవాణి స్పీచ్ లాస్ట్ లో ‘నమస్తే’ అని స్టేజీని వీడారు. అయితే చంద్రబోస్ స్టేజీపై మాట్లాడకపోవడం పట్ల చాలా మంది అభిమానులు అప్పెట్ అవుతున్నారు. ఆయన రెండు ముక్కలు మాట్లాడితే బాగుండేదని అంటున్నారు. ఇంతకీ చంద్రబోస్ మాట్లాడకపోవడానికి ఓ రీజన్ ఉందంట. అదే ‘ఆస్కార్’ నిబంధనలు. ఆస్కార్ గెలుచుకున్న వారు స్టేజీపై లాంగ్ స్పీచ్ ఇవ్వడానికి ఏమాత్రం అనుమతించరు. అకాడమీ కేటాయించిన సమయంలోనే స్పీచ్ ముగించాల్సి ఉంటుంది.
 
ఆస్కార్ విన్నర్స్ కు వేదికపై మాట్లాడటానికి కేవలం 45  సెకండ్ల టైమ్ ను మాత్రమే కేటాయిస్తారంట. ఒక కేటగిరీలో ఎంతమందికి అవార్డులను అందించినా.. కేవలం ఒక్కరు మాత్రమే మాట్లాడేలా అకాడమీ టైమ్ సెట్ చేసింది. ఈకారణంగా చంద్రబోస్ ఆస్కార్ వేదికపై పెద్దగా మాట్లాడలేకపోయారు. కానీ చివరల్లో  ఇండియన్ స్టైల్ లో ‘నమేస్తే’ చెబుతూ ఆకట్టుకుంటున్నారు. లేదంటే చంద్రబోస్ తన సాహిత్యంతో స్టార్స్ ను సైతం ఆకర్షించే వారని అభిమానులు అంటున్నారు. ఏదేమైనా ఇండియాకు ఆస్కార్ వరించడం పట్ల సినీ ఇండస్ట్రీలో పండగ వాతావరణాన్నితెచ్చిపెట్టింది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios