ఆర్ ఆర్ ఆర్ నుండి నేడు ఓ కీలక అప్డేట్ రావడం జరిగింది. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలుపెడుతున్నట్లు రాజమౌళి ప్రత్యేక వీడియో విడుదల చేశారు. అలాగే చాలా కాలంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. నేడు రాజమౌళి బర్త్ డే పురస్కరించుకుకొని ఈ వీడియో విడుదల చేయడం విశేషం. 

ప్రకటన వీడియో కూడా చాల అద్భుతంగా సిద్ధం చేశారు రాజమౌళి. షూటింగ్ కోసం ఆయన సిబ్బంది సిద్ధం అవుతున్న వీడియో ఆసక్తి రేపుతోంది. రెండు నెలలు నిరవధికంగా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ప్లాన్ చేశారు. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తిరిగి ప్రారంభం కావడం జరిగింది. కాగా ఈ వీడియోలో అస్పష్టంగా ఎన్టీఆర్, చరణ్ లను రాజమౌళి ప్రెజెంట్ చేశారు. చరణ్ గుర్రంపై, ఎన్టీఆర్ బులెట్ పై స్వారీ చేయడం ఆసక్తి రేపుతోంది. 

కాగా కొమరం భీం గా ఎన్టీఆర్, అల్లూరిగా రామ్ చరణ్ కలిసి యుద్దాలు చేస్తారని ఈ వీడియో తెలియజేస్తుంది. అది కూడా ఒకరు బుల్లెట్ పై మరొకరు గుర్రంపై పాలకులపైకి యుద్దానికి. పోరుకు వెళ్లడం ఆసక్తిగొలిపే అంశమే. ఇక అక్టోబర్ 22న విడుదల కానున్న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియోలో ఏముంటుంది, ఎన్టీఆర్ ని ఎలా చూపించనున్నాడు అనేది ఆసక్తికరం. మొత్తంగా చాలా కాలంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న అప్డేట్ రాజమౌళి ఇవ్వడం విశేషం.