శాన్ డియాగో కామిక్ కాన్ వేదికగా ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD టీజర్ విడుదలైంది. టీజర్ చూసిన చిత్ర ప్రముఖులు, అభిమానులు దర్శకుడు నాగ్ అశ్విన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజమౌళి తన స్పందన తెలియజేశారు.  

 ప్రాజెక్ట్ కే ఫస్ట్ లుక్ నిరాశపరిచిన నేపథ్యంలో ఫ్యాన్స్ లో టీజర్ పై సందేహాలు నెలకొన్నాయి. ఆదిపురుష్ తరహాలో నాగ్ అశ్విన్ అరాకొరా గ్రాఫిక్స్ తో టీజర్ విడుదల చేస్తే... సీన్ రిపీట్ అవుతుందని భావించారు. ఈ క్రమంలో ప్రాజెక్ట్ కే చిత్ర టైటిల్ అండ్ టీజర్ పై ఉత్కంఠ నెలకొంది. భారత కాలమానం ప్రకారం జులై 20 అర్థరాత్రి యూఎస్ లో విడుదల చేశారు. నిమిషానికి పైగా ఉన్న టీజర్ అంచనాలు అందుకుంది. ఉన్నత నిర్మాణ విలువలు, సాంకేతికత, విజువల్స్ తో హాలీవుడ్ చిత్రాన్ని తలపించింది. ప్రభాస్, దీపికా పదుకొనె, అమితాబ్ పాత్రలో ఆసక్తి రేపాయి. టీజర్లో నటుడు పశుపతి కూడా ఉన్నారు. మొత్తంగా నాగ్ అశ్విన్ టీజర్ విషయంలో మెప్పించాడు. 

కాగా కల్కి టీజర్ పై రాజమౌళి కొంచెం లేటుగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా తన స్పందన తెలియజేశాడు. దర్శకుడు నాగి, వైజయంతి మూవీస్ పనితీరు అద్భుతం. ఖచ్చితమైన ప్రమాణాలతో కూడిన ఫ్యూచరిస్టిక్ మూవీ చేయడం చాలా కష్టం. మీరు అసాధ్యం సుసాధ్యం చేశారు. డార్లింగ్(ప్రభాస్) లుక్ అదిరింది. కానీ ఒక ప్రశ్న మిగిలిపోయింది. రిలీజ్ డేట్ ఎప్పుడు... అని కామెంట్ చేశాడు. తన ట్వీట్లో ఆద్యంతం కల్కి టీమ్ ని పొగిడిన రాజమౌళి చివర్లో విడుదల తేదీ తెలియదన్నట్లు కామెంట్ చేశాడు. 

Scroll to load tweet…

ఇంత పెద్ద ప్రాజెక్ట్ విడుదల తేదీ రాజమౌళి తెలియకదు అనుకోవడం అపోహ. చాలా కాలం క్రితమే ప్రాజెక్ట్ కే 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మరి రాజమౌళి రిలీజ్ డేట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం వెనుక ఏదో గూడార్థం ఉందనిపిస్తుంది. కల్కి విడుదలకు ఇంకా చాలా సమయం ఉందని పరోక్షంగా అభిప్రాయ పడ్డారా? లేక టీజర్ ఏమంత గొప్పగా లేదని ఇండైరెక్ట్ సెటైర్ వేశాడా? లేక ఆయన సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాని చెప్పాడా? అనేది అర్థం కావడం లేదు. 

రాజమౌళి ట్వీట్ కి బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించడం విశేషం. చూడండి ఎవరు రిలీజ్ డేట్ అడుగుతున్నారో... అని నవ్వుతున్న ఎమోజీలు జోడించారు. 2024 జనవరి 12న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కల్కి చిత్రంలో కమల్ హాసన్ సైతం నటిస్తున్న విషయం తెలిసిందే.