Asianet News TeluguAsianet News Telugu

ఫ్యాన్సీ ధరకు నాగార్జున ది ఘోస్ట్ శాటిలైట్ రైట్స్ !


నాగార్జున లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ఫ్యాన్సీ ధర చెల్లించి ప్రముఖ ఛానల్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 

this channel bags nagarjuna the ghost movie satellite rights
Author
First Published Sep 29, 2022, 8:10 PM IST

ప్రయోగాలు చేయడంలో నాగార్జున ఎప్పుడూ ముందుంటారు. కెరీర్ లో నాగ్ భిన్నమైన జోనర్స్ ట్రై చేసి బ్లాక్ బస్టర్స్ నమోదు చేశారు. 60 ఏళ్ళ వయసులో నాగార్జున యాక్షన్ ఎంటర్టైనర్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు. దీనిలో భాగంగా వైల్డ్ డాగ్ టైటిల్ తో యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేశారు. మూవీ ఫలితం మాత్రం దెబ్బేసింది. అయినా వెనక్కి తగ్గని నాగార్జున ఇదే జోనర్లో మరో మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. 

గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా ది ఘోస్ట్ తెరకెక్కింది. ఈ మూవీలో నాగార్జున 'రా' ఏజెంట్ గా నటిస్తున్నారు. లెక్కకు మించిన యాక్షన్ ఎపిసోడ్స్ తో థ్రిల్లింగ్ అంశాలతో దర్శకుడు ప్రవీణ్ ది ఘోస్ట్ రూపొందించారు. అక్టోబర్ 5న దసరా కానుకగా ది ఘోస్ట్ విడుదల కానుంది. ది ఘోస్ట్ విజయంపై నాగార్జున ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నారు. అదే రోజు చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ విడుదలవుతుండగా... బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి.

కాగా ది ఘోస్ట్ శాటిలైట్ రైట్స్ ప్రముఖ ఛానల్ జెమినీ ఫ్యాన్సీ ధర చెల్లించి దక్కించుకున్నట్లు సమాచారం. ఇక సునీల్ నారంగ్, పూసుకుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.  సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది. బంగార్రాజు మూవీతో హిట్ ట్రాక్ ఎక్కిన నాగార్జున ది ఘోస్ట్ తో మరో హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. ఇదే తేదీన నాగార్జున ఎవర్ గ్రీన్ హిట్ అండ్ ట్రెండ్ సెట్టర్ శివ విడుదల కావడం విశేషం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios