బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ నటిస్తోన్న చిత్రం 'సాహో'. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాదిలో విడుదల కానున్న ఈ సినిమా మేకింగ్ టీజర్ ని రీసెంట్ గా ప్రభాస్ పుట్టినరోజు కానుకగా విడుదల చేశారు.

ఇప్పటికే ఈ వీడియో భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. ఈ టీజర్ లో ప్రభాస్ జాకెట్ వేసుకొని గాగుల్స్ పెట్టుకొని బైక్ డ్రైవ్ చేయడం చాలా స్టైలిష్ గా అనిపించింది.

హాలీవుడ్ రేంజ్ లో ఉందని ఆయన అభిమానులు మురిసిపోయారు. ఇప్పుడు ఇదే వీడియో ప్రభాస్ కి కోట్లు తెచ్చిపెడుతుందని తెలుస్తోంది. ఈ వీడియో చూసిన ప్రముఖ బైక్ కంపనీ బ్రాండ్ ఎండార్స్ మెంట్ కోసం ప్రభాస్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. డీల్ కుదుర్చుకోవడానికి భారీ మొత్తంలో ప్రభాస్ కి ఆఫర్ చేసినట్లు సమాచారం.

ప్రభాస్ కూడా ఈ డీల్ విషయంలో ఆసక్తి చూపిస్తున్నాడని త్వరలోనే ఫైనల్ చేస్తాడని టాక్. ఈ బైక్ కంపనీ మాత్రమే కాకుండా ఇతర కార్పోరేట్ కంపనీలు కూడా తమ బ్రాండ్ ని ప్రమోట్ చేయమని ప్రభాస్ వెంట పడుతున్నాయి. ఇక 'సాహో' సినిమా కూడా సక్సెస్ అయితే ప్రభాస్ క్రేజ్ మరింత పెరగడం ఖాయం.