Asianet News TeluguAsianet News Telugu

తారక్‌ అన్న నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాడు.. థియేటర్లపై నాని అన్న చెప్పింది నిజమేః `తిమ్మరుసు` హీరో సత్యదేవ్‌

థియేటర్లు ఓపెన్‌ అయ్యాక విడుదలవుతున్న తొలి చిత్రం `తిమ్మరుసు`. దీంతో సినిమా అందరి అటెన్షన్‌ని గ్రాస్ప్ చేస్తుంది. ఈ నేపథ్యంలో హీరో సత్యదేవ్‌ ఇంట్రెస్టింగ్‌ విషయాలను వెల్లడించారు. 

thimmarusu hero satyadev thanks to ntr and intresting comments on theaters arj
Author
Hyderabad, First Published Jul 29, 2021, 5:36 PM IST

`తారక్‌(ఎన్టీఆర్‌) అన్న ట్రైలర్‌ రిలీజ్‌ చేసి సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాడు. ఆయన చేసిన హెల్ప్ మర్చిపోలేనిది` అని అన్నారు హీరో సత్యదేవ్‌. `తిమ్మరుసు` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నేచురల్‌ స్టార్‌ నాని థియేటర్లపై చేసిన వ్యాఖ్యలను సమర్ధించారు. సత్యదేవ్‌ హీరోగా, ప్రియాంక జవాల్కర్‌ హీరోయిన్‌గా నటించిన చిత్రం `తిమ్మరుసు`. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం రేపు(జులై 30) శుక్రవారం విడుదల కానుంది. 

కరోనా సెకండ్‌ వేవ్‌ అనంతరం థియేటర్లు ఓపెన్‌ అయ్యాక విడుదలవుతున్న తొలి చిత్రమిది. దీంతో సినిమా అందరి అటెన్షన్‌ని గ్రాస్ప్ చేస్తుంది. ఈ నేపథ్యంలో హీరో సత్యదేవ్‌ మీడియాలో పలు ఇంట్రెస్టింగ్‌ విషయాలను వెల్లడించారు. యావజ్జీవ కారాగార శిక్ష సెక్షన్‌కి సంబంధించిన లూప్‌ హోల్స్ తో ఓ సామాన్యుడిని లాయర్‌ అయిన హీరో ఎలా కాపాడాడు. సామాన్యుడికి న్యాయం కోసం ఏం చేశాడు, తిమ్మరుసు వల్లే ఎలా ఎత్తులు వేశాడనే కథాంశంతో ఈ సినిమా సాగుతుందన్నారు. సీరియస్‌ అంశాలతోపాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా ఉంటుందన్నారు. ఓ కొత్త రకమైన కోర్ట్ రూమ్‌ సినిమా అని, న్యూ జోనర్‌ చిత్రమవుతుందన్నారు. 

మరోవైపు తారక్‌(ఎన్టీఆర్‌) `తిమ్మరుసు` ట్రైలర్‌ని లాంచ్‌ చేసి సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లారని, ఐదు మిలియన్స్ వ్యూస్‌ వచ్చాయని తెలిపారు. మాస్‌ ఆడియెన్స్ లోకి ట్రైలర్‌ వెళ్లిందని, ఎన్టీఆర్‌కి కి థ్యాంక్స్ చెప్పారు. ఇటీవల ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో గెస్ట్ గా వచ్చిన నాని థియేటర్లపై చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తూ ఆయన చెప్పింది నిజమే అన్నారు సత్యదేవ్‌. బయట మార్కెట్‌లో చాలా మంది మాస్క్ లు లేకుండా గుంపులుగా తిరుగుతున్నారని, కానీ థియేటర్లు చాలా సేఫ్‌ ప్లేస్‌ అని తెలిపారు. కరోనా వల్ల థియేటర్లు ఫస్టే క్లోజ్‌ చేసి, ఆ తర్వాత ఎప్పటికో ఓపెన్‌ చేస్తున్నారని వాపోయారు. ఆడియెన్స్ కి థియేటర్‌ ఎక్స్ పీరియెన్స్‌ ని భర్తీ చేసే మాద్యమం మరేదీ లేదన్నారు. 

అదే సమయంలో ఓటీటీలను తాను తప్పు పట్టడం లేదని, ఓటీటీ తనకు ఫస్ట్ వేవ్‌ సమయంలో లైఫ్‌ ఇచ్చాయని, కానీ థియేటర్లో సినిమా చూస్తే వచ్చే కిక్‌ వేరన్నారు. థియేటర్లో సినిమా చూడాలా? వద్దా అనేది ఆడియెన్స్ వ్యక్తిగత నిర్ణయమని, కరోనా పేరుతో థియేటర్లని ఇంకా ఓపెన్‌ చేయకపోవడం కరెక్ట్ కాదన్నారు. తమ సినిమా రేపు అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందని, అయితే జనం థియేటర్‌కి వస్తారా? రారా? అనేది ఆసక్తిగా వెయిట్‌ చేస్తున్నట్టు చెప్పారు. అయితే ఆర్‌టీసీ ఎక్స్ రోడ్‌లోని `దేవి` థియేటర్లో తన సినిమా ప్రదర్శించబడటమనేది ఓ డ్రీమ్‌లా ఉందన్నారు.

మరోవైపు తాను మొదటినుంచి డిఫరెంట్‌ సినిమాలు చేస్తున్నానని, గతేడాది వచ్చిన `ఉమామహేశ్వర ఉగ్రరూపస్య` చిత్రం కెరీర్‌ పరంగా టర్న్ తిప్పిందని, నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లిందని చెప్పారు. ఇప్పుడు తన లాంటి డిఫరెంట్‌ సినిమాలు చేసే వారి టైమ్‌ వచ్చిందని, న్యూ ఏజ్‌ ఫిల్మ్స్, న్యూ ఏజ్‌ ఫిల్మ్ మేకర్స్ టైమ్‌ వచ్చిందన్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ తాను ఈ లాక్‌ డౌన్‌ సమయంలో ఐదు సినిమాలు పూర్తి చేసినట్టు చెప్పారు. `గాడ్సే`, `స్కైలాబ్‌`, `గుర్తుందా శీతాకాలం`, `రామ్‌సేతు`తోపాటు మరో సినిమా చేస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది మూడు సినిమాలతో రాబోతున్నట్టు వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios