Asianet News TeluguAsianet News Telugu

‘తిమ్మరుసు’ థియేటర్లలో విడుదల..ఎప్పుడంటే

ఇప్పటికే షూటింగ్ లు  పూర్తి చేసుకున్న కొన్ని చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. తాజాగా ‘తిమ్మరుసు’ విడుదల తేదీ ఖరారైంది.

Thimmarusu Gets U/A, To Hit Screens July 30 jsp
Author
Hyderabad, First Published Jul 25, 2021, 9:45 AM IST


కొవిడ్‌ కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్లు తెరుచుకునేందుకు ఫర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే షూటింగ్ లు  పూర్తి చేసుకున్న కొన్ని చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. తాజాగా ‘తిమ్మరుసు’ విడుదల తేదీ ఖరారైంది.

’ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాతో హీరోగా మారిన సత్యదేవ్ ఓ వర్గంలో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు వెబ్‌సిరీస్‌లలోనూ నటిస్తున్నారు. తాజాగా సత్యదేవ్‌ హీరోగా 'తిమ్మరుసు’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ‘అసైన్‌మెంట్‌ వాలి’ అనేది ట్యాగ్‌లైన్‌. తిమ్మరుసు లాంటి తెలివితేటలున్న లాయర్‌ పాత్రలో సత్యదేవ్‌  కనిపించనున్నారు. 'టాక్సీవాలా' చిత్రంతో హీరోయిన్‌గా ఆకట్టుకున్న ప్రియాంకా జవాల్కర్‌ ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జోడీగా నటించింది.

సత్యదేవ్‌ మాట్లాడుతూ– ‘‘కథ బాగా నచ్చడంతో  ‘తిమ్మరుసు’ చేశా. శరణ్‌ కూల్‌గా సినిమాని పూర్తి చేశాడు’’ అన్నారు.  ‘‘ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్‌ అంశాలు, వినోదం, సందేశం ఉంటాయి. థియేటర్లలో చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు మహేశ్‌ కోనేరు. ‘‘శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలోని తిమ్మరుసు చాలా తెలివైన వ్యక్తి. అలాంటి తెలివితేట లున్న లాయర్‌ పాత్రలో సత్యదేవ్‌ నటించారు. కోవిడ్‌ నేపథ్యంలో సవాళ్లు   ఎదుర్కొంటూ ఈ చిత్రాన్ని పూర్తి చేశాం’’ అన్నారు శరణ్‌. 

శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేశ్‌ కోనేరు, సృజన్‌ ఎరబోలు నిర్మించారు.  ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా రిలీజ్‌కు బ్రేక్‌ పడింది. తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 30న థియేటర్స్‌లో విడుదల కానుంది. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందించారు. 

‘ఇంతకాలం మిమ్మల్ని మిస్‌ అయ్యాం. మళ్లీ కలుసుకోబోతున్నాం. థియేటర్లు ఓపెన్‌ అయ్యాయి. మీ అందరినీ ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని అన్నారు సత్యదేవ్‌. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మహేశ్‌ ఎస్‌. కోనేరు నిర్మించిన ఈ చిత్రానికి శ్రీ చరణ్‌ పాకాల సంగీతం అందించారు.   
 

Follow Us:
Download App:
  • android
  • ios