Bigg Boss Telugu Season 8: మరో పది రోజుల్లో బిగ్ బాస్, ఫైనల్ అయిన 12 మంది కంటెస్టెంట్స్ వీరే!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ కి మరో పది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఖచ్చితంగా కంటెస్టెంట్స్ లిస్ట్ లో 12మంది సెలెబ్రిటీలు వీరే అంటూ ఓ వార్త తెరపైకి వచ్చింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కోసం ప్రేక్షకులు వెయిటింగ్. ఇటీవల విడుదలైన ప్రోమోలు ఆసక్తి రేపాయి. హోస్ట్ నాగార్జున ఈసారి ఎంటర్టైన్మెంట్, ఫన్, ట్విస్ట్స్ కి లిమిటే లేదు అంటున్నాడు. ఆయన మాటల వెనుక ఆంతర్యం ఏమిటనేది షో మొదలైతే కానీ తెలియదు. ఇక కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తి అయ్యింది. లాంచింగ్ ఎపిసోడ్ వరకు కంటెస్టెంట్స్ ఎవరు అనేది సీక్రెట్. ప్రతి సీజన్ కి ఊహాగానాలు చక్కర్లు కొడతాయి. ప్రచారమైన సెలెబ్స్ లో కొందరు కచ్చితంగా ఉంటారు.
కాగా బిగ్ బాస్ తెలుగు 8 లాంచింగ్ ఎపిసోడ్ కి డేట్ ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 1న సాయంత్రం 7గంటలకు గ్రాండ్ లాంచ్ ఈవెంట్ స్టార్ మా లో ప్రసారం కానుంది. సెప్టెంబర్ 8న ఫస్ట్ ఎపిసోడ్ అంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో అనుకున్న సమయానికి ముందే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రేక్షకుల ముందుకు వస్తుంది. స్టార్ హీరోలు గెస్ట్స్ గా రానున్నారని సమాచారం. ఎప్పటిలాగే ఇతర హీరోయిన్స్, కంటెస్టెంట్స్ అదిరిపోయే పెరఫార్మన్స్లు ఇవ్వనున్నారు.
కాగా సీజన్ 8లో బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టే సెలెబ్స్ లో ఈ 12 మంది ఖచ్చితంగా ఉంటారంటూ ఓ లిస్ట్ బయటకు వచ్చింది. దాని ప్రకారం... రీతూ చౌదరి, విష్ణు ప్రియ, సీరియల్ నటుడు నిఖిల్, జబర్దస్త్ మాజీ యాంకర్ సౌమ్యరావు, మోడల్ ఊర్మిళ చౌహాన్, సీరియల్ నటి అంజలి పవన్, బెజవాడ బేబక్క, సింగర్ సాకేత్, యాక్టర్ అభిరామ్ వర్మ, నటి సోనియా సింగ్, నటుడు ఖయ్యూం బిగ్ బాస్ హౌస్లోకి వెళుతున్నారట. ఈ సెలెబ్స్ ఎంపిక దాదాపు ఖరారు అయ్యిందని అంటున్నారు. సాధారణంగా ప్రతి సీజన్ కి 19 నుండి 21 మంది కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు. మిగతా సెలెబ్స్ ఎవరనేది చూడాలి.
బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ సక్సెస్. ఈ క్రమంలో లేటెస్ట్ సీజన్ పై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచేలా నయా కాన్సెప్ట్స్ తో షోని సిద్ధం చేశారట. ఈసారి కంటెస్టెంట్స్ టైటిల్ కోసం గట్టిగా పోరాడాల్సి ఉంటుందట. గేమ్స్, టాస్క్స్, రూల్స్ కఠినంగా ఉండే సూచనలు కలవు. బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ కి సమయం దగ్గర పడగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.