గాడ్ ఫాదర్ టైటిల్ కి పెద్ద హిస్టరీ ఉంది. హాలీవుడ్ లో ఇది ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన మూవీ. గ్యాంగ్ స్టర్ చిత్రాలకు రిఫరెన్స్ గా నిలిచిన మూవీ. చిరంజీవి చిత్రానికి అంత పవర్ ఫుల్ టైటిల్ ఎవరు ఎవరు నిర్ణయించారో తెలుసా...
గాడ్ ఫాదర్.. కొన్ని టైటిల్స్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. సినిమాపై అంచనాలు పెంచేస్తాయి. అలాంటి టైటిలే గాడ్ ఫాదర్. మలయాళ చిత్రం లూసిఫర్ రీమేక్ కి గాడ్ ఫాదర్ టైటిల్ ఫిక్స్ చేశారు. చిరంజీవి మాస్ ఇమేజ్ కి , ఆయన స్టార్ డమ్ కి చక్కగా సరిపోయింది. ఈ టైటిల్ ని సెట్ చేసింది దర్శకుడు మోహన్ రాజా కాదు. ఈ విషయాన్ని చిరంజీవి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.
లూసిఫర్ తెలుగు రీమేక్ వర్కింగ్ టైటిల్ సర్వాంతర్యామి. ఆ టైటిల్ తోనే షూటింగ్ పూర్తి చేశారు. అయితే గాడ్ ఫాదర్ టైటిల్ ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సూచించాడు. సెంటిమెంట్ పరంగా కూడా కలిసొస్తుంది. గతంలో మీరు నటించిన గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు టైటిల్స్ లెటర్ G తో మొదలయ్యాయి. బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి, అని థమన్ అన్నారట. ఆయన సూచించిన గాడ్ ఫాదర్ టైటిల్ అందరికీ నచ్చడంతో ఫైనల్ చేశారట.
అయితే హాలీవుడ్ మూవీ గాడ్ ఫాదర్ నిర్మాతల నుండి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయట. వాళ్ళ నుండి అనుమతి తీసుకోవడం జరిగిందట. సినిమా విడుదలకు వారం రోజుల ముందు మాత్రమేఎన్ ఓ సి లభించినట్లు చిరంజీవి వెల్లడించారు. ఒకవేళ సర్వాంతర్యామి టైటిల్ తో మూవీ విడుదల చేస్తే ఫలితం ఎలా ఉండేదో. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్ నిర్మించారు. సత్యదేవ్, నయనతార కీలక రోల్స్ చేశారు. థమన్ సంగీతం అందించారు.
