Asianet News TeluguAsianet News Telugu

'తెల్ల‌వారితే గురువారం‌' పరిస్దితి మరీ అంత దారుణమా?

 ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుమారుడు శ్రీ సింహా. తొలి చిత్రం ‘మత్తు వదలరా’తో పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత  చాలా గ్యాప్‌ తీసుకున్న శ్రీసింహ.. ఇప్పుడు ‘తెల్లవారితే గురువారం’అనే వెరైటీ  టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మణికాంత్ గెల్ల తెరకెక్కించిన ఈ సినిమాను  వారాహి, లౌక్య ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.    టీజర్‌, ట్రైలర్‌లతో చిత్రంపై భారీ అంచనాలు పెంచారు. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడం..ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా రావడంతో ఈ మూవీపై హైప్‌ క్రియేట్‌ అయింది. ఇలా ఎన్నో అంచనాల మధ్య శనివారం(మార్చి 27) విడుదలైన ‘తెల్లవారితే గురువారం’ప్రేక్షకులను  ఆకట్టుకోవటంలో ఫెయిలైంది. 
 
Thellavarithe Guruvaram Movie collctions drop jsp
Author
Hyderabad, First Published Mar 29, 2021, 3:57 PM IST

 ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుమారుడు శ్రీ సింహా. తొలి చిత్రం ‘మత్తు వదలరా’తో పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత  చాలా గ్యాప్‌ తీసుకున్న శ్రీసింహ.. ఇప్పుడు ‘తెల్లవారితే గురువారం’అనే వెరైటీ  టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మణికాంత్ గెల్ల తెరకెక్కించిన ఈ సినిమాను  వారాహి, లౌక్య ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.    టీజర్‌, ట్రైలర్‌లతో చిత్రంపై భారీ అంచనాలు పెంచారు. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడం..ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా రావడంతో ఈ మూవీపై హైప్‌ క్రియేట్‌ అయింది. ఇలా ఎన్నో అంచనాల మధ్య శనివారం(మార్చి 27) విడుదలైన ‘తెల్లవారితే గురువారం’ప్రేక్షకులను  ఆకట్టుకోవటంలో ఫెయిలైంది. 

 అయితే  'తెల్లవారితే గురువారం' సినిమా విడుదలకు ముందే నాన్ థియేటర్ రైట్స్ మొత్తం సింగిల్ విండో కింద అమ్ముడయిపోయాయి. మూడున్నర కోట్లకు అమ్మారని తెలిసింది. సినిమాకు సైతం పాజిటివ్ బజ్ వచ్చింది. కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఆ బజ్ అంతా మాయమైపోయింది.  హీరోనే స్వయంగా సోషల్ మీడియాలో కొన్ని స్క్రీన్ షాట్స్ పెట్టి హౌస్ ఫుల్ అని హడావుడి చేసినా ఫలితం లేకపోయింది. మార్నింగ్ షో నుంచే సినిమా మళ్లీ కోలుకోలేని స్దితికి వెళ్లిపోయింది.  రివ్యూలు కూడా చాలా నెగిటివ్ గా వచ్చాయి. దాంతో సినిమా కలెక్షన్లు పూర్తి డ్రాప్.థియేటర్ రెంట్లు కూడా కిట్టుబాటయ్యేలా కనిపించడం లేదని మీడియాలో టాక్. 

చిత్రం కథేమిటంటే... వీరేంద్ర అలియాస్‌ వీరు(శ్రీసింహ),  మధు (మిషా నారంగ్‌)లకి తెల్లవారితే గురువారం అనగా పెళ్లి. అయితే ఇద్దరూ పెళ్లి చేసుకోదలుచుకోలేదు. ఎవరి కారణాలువారికు ఉన్నాయి. దాంతో ఇద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు పెళ్లి పీటలు ఎక్కకుండా పరారు అయ్యారు. అయితే ఆ తర్వాత జర్నీలో వీళ్లిద్దరు కలిసారు. ఈ క్రమంలో తాము ఎందుకు ఆ పెళ్లి వద్దనుకుంటున్నారో ఫ్లాష్ బ్యాక్ లు చెప్పుకున్నారు. అసలు వాళ్ల ప్లాష్ బ్యాక్ కథలేంటి..ఆ రాత్రి వాళ్లిద్దరు కలిసి ఏం చేసారు. తెల్లారి వీళ్లిద్దరు పెళ్లి జరిగిందా..మధ్యలో డాక్టర్‌ కృష్ణవేణి(చిత్ర శుక్లా) పాత్ర ఏమిటి...వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Follow Us:
Download App:
  • android
  • ios