చాలా చిత్రాలలో విలన్‌ గా, హాస్యనటుడిగా కనిపించాడు. ప్రదీప్‌ ఇంటికి వెళ్లి చూడగా అతడు శవమై కనిపించాడు. 


ప్రముఖ తమిళ నటుడు ప్రదీప్‌ విజయన్‌ అనుమానాస్పద స్థితిలో మరణించారు. తమిళనాడు పాలవక్కంలోని తన గదిలో బుధవారం (జూన్‌ 12న) మృతి చెంది కనిపించారు. గత రెండు రోజులుగా ప్రదీప్‌కు అతని స్నేహితుల నుండి కాల్స్ వస్తున్నాయి. కాని., కాల్ చేసిన కానీ అయన స్పందించలేదు. దాంతో అనుమానం వచ్చిన ఓ స్నేహితుడు అతడి ఇంటి దెగ్గరికి వెళ్లి పలు మార్లు తలుపును తట్టాడు. ఆ సమయంలో బయట వాకిలి లోపలి నుండి గడియ పెట్టి ఉంది.

దీంతో పోలీసులకు సమాచారమిచ్చాడు. వారు ప్రదీప్‌ ఇంటికి వెళ్లి చూడగా అతడు శవమై కనిపించాడు. గుండెపోటు వల్లే నటుడు మరణించాడని భావిస్తున్నారు. పోలీసులు తలుపు పగులకొట్టి ఇంటికి లోపలికి వెళ్లి చూడగా అతడు శవమై కనిపించాడు. నటుడు గుండెపోటుతో మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

ఇక ప్రదీప్‌.. తెగిడి అనే సినిమాతో పాపులర్‌ అయ్యారు. విలన్‌గా, కమెడియన్‌గా పలు సినిమాలు చేశారు. అతను ‘టెడ్డీ’, ‘ఇరుంబు తిలై’, ‘తమిళోకు ఎన్ ఒండ్రై అరథూమ్’, ‘లిఫ్ట్’, ‘మనం’, ‘క్లబ్ కెన్నెడీ’, ‘ఆడై’ వంటి అనేక తమిళ చిత్రాలలో నటించాడు. ఇక చివరిగా లారెన్స్ నటించిన ‘రుద్రన్‌’లో నటించాడు.