రామ్ పోతినేని (Ram Pothineni), ‘ఉప్పెన’ (Uppena) బ్యూటీ కృతిశెట్టి (Krithishetty) జంటగా నటించిన కాప్ యాక్షన్ థ్రిల్లర్ ది ‘వారియర్’ (The Warrior). లింగుసామి (Lingusamy) దర్శకత్వంలో శ్రీశ్రీనివాస సిల్వర్ స్ర్కీన్స్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి (Srinivas Chitturi) చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 14న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. 


సాధారణంగా మన తెలుగు స్టార్ హీరోల సినిమాలకు ముందుగా యుఎస్ టాక్ వచ్చేస్తూంటుంది. అది పాజిటివ్ గా ఉంటే ఫరవాలేదు. అక్కడ నుంచి తేడా టాక్ వస్తే మాత్రం ఇక్కడ మనవాళ్లు ఎలర్టై పోతారు. దాంతో తెలియకుండానే ఇక్కడ కలెక్షన్స్ ఆ టాక్ ఎఫెక్ట్ పడిపోతోంది. దాంతో పెద్ద సినిమాలు వాళ్లు సాధ్యమైనంత మేరకు అక్కడ టాక్ ని కంట్రోలు చేయటానికి ప్రయత్నిస్తున్నారు. రామ్ తాజా చిత్రం ది ‘వారియర్’కు ముందు టాక్ బయిటకు రాకుండా ఓ స్ట్రాటజీ ప్రకారం ముందుకు వెళ్తున్నారు.

యుఎస్ లో ఈ చిత్రం ప్రీమియర్స్ బాగా లేటుగా స్టార్ట్ అవుతాయి. అంటే దాదాపు ఇండియాలో ఏ సమయానికి ప్రారంభమవుతాయో అదే టైమ్ కు అక్కడ కూడా మొదలవుతాయి. దాంతో ముందుగా టాక్ వచ్చే అవకాసం లేదని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ మేరకు నిర్మాత జాగ్రత్తలు తీసుకుని అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎందుకింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు..తమ సినిమాపై అంత నమ్మకం ఉన్నప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్దం కావటం లేదు అంటున్నారు సోషల్ మీడియా జనం. 

రామ్ పోతినేని (Ram Pothineni), ‘ఉప్పెన’ (Uppena) బ్యూటీ కృతిశెట్టి (Krithishetty) జంటగా నటించిన కాప్ యాక్షన్ థ్రిల్లర్ ది ‘వారియర్’ (The Warrior). లింగుసామి (Lingusamy) దర్శకత్వంలో శ్రీశ్రీనివాస సిల్వర్ స్ర్కీన్స్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి (Srinivas Chitturi) చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 14న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సింగిల్స్, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు మేకర్స్. తాజాగా ‘ది వారియర్’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సా్ర్ వారు చిత్రానికి యూ / ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. అలాగే ఈ సినిమాకి 155 నిమిషాల ప్రదర్శనా సమయాన్ని ఫిక్స్ చేశారు. 

తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో చిత్రీకరణ జరుపుకున్న ‘ది వారియర్’ చిత్రానికి ఓ రేంజ్ లో ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ, కర్నాటక , ఓవర్సీస్, తమిళ భాషలతో కలుపుకొని ది వారియర్ చిత్రం మొత్తం రూ. 43. 10 కోట్లు ప్రీరిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. రామ్ 19వ చిత్రంగా విశేషాన్ని సంతరించుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతేడాది ‘రెడ్’ (Red) చిత్రంతో అభిమానుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయిన రామ్.. ఈ సినిమాతో కచ్చితంగా మాస్ ట్రీట్ ఇస్తాడని అంటున్నారు. మరి ఈ సినిమాతో రామ్ పోతినేని ఏ స్థాయిలో పేరు తెచ్చుకుంటాడో చూడాలి.