Asianet News Telugu

పవర్ ఈజ్ స్టేట్ ఆఫ్ మైండ్... దుమ్మురేపుతున్న వాలిమై మోషన్ పోస్టర్

పవర్ ఈజ్ స్టేట్ ఆఫ్ మైండ్... అనే క్యాప్షన్ తో వాలిమై మోషన్ పోస్టర్ దుమ్మురేపింది. బైకర్ గా అజిత్ సూపర్ స్టైలిష్ గా ఉన్నారు. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో అజిత్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేయనున్నట్లు విడుదలైన మోషన్ పోస్టర్ ద్వారా అర్థం అవుతుంది. 
 
the wait is over here is ajith kumar valimai motion poster ksr
Author
Hyderabad, First Published Jul 11, 2021, 6:56 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

తల అజిత్ కుమార్ ఫ్యాన్స్ కి భారీ ట్రీట్ ఇచ్చారు. ఆయన లేటెస్ట్ మూవీ వాలిమై మోషన్ పోస్టర్ విడుదల చేశారు. వాలిమై అప్డేట్ కోసం ఫ్యాన్స్ చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణకు తెరదించుతూ నేడు మోషన్ పోస్టర్ తో పాటు అజిత్ లుక్ కి సంబంధించిన పోస్టర్స్ విడుదల చేశారు. 

పవర్ ఈజ్ స్టేట్ ఆఫ్ మైండ్... అనే క్యాప్షన్ తో వాలిమై మోషన్ పోస్టర్ దుమ్మురేపింది. బైకర్ గా అజిత్ సూపర్ స్టైలిష్ గా ఉన్నారు. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో అజిత్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేయనున్నట్లు విడుదలైన మోషన్ పోస్టర్ ద్వారా అర్థం అవుతుంది. 

బోనీ కపూర్ నిర్మాతగా భారీ ఎత్తున తెరకెక్కిన ఈ చిత్రానికి హెచ్ వినోత్ దర్శకత్వం వహించారు. వినోత్-అజిత్ కాంబినేషన్ లో తెరకెక్కిన రెండవ చిత్రం వాలిమై. అజిత్ గత చిత్రం నెర్కొండ పార్వై చిత్రానికి దర్శకుడిగా వినోత్ పని చేసిన విషయం తెలిసింది. నెర్కొండ పార్వై చిత్రానికి కూడా బోనీ కపూర్ నిర్మాతగా ఉన్నారు. అజిత్, బోనీ కపూర్, వినోత్ వాలిమై కోసం మరోమారు జతకట్టారు. 

యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా తెలుగు యువ హీరో కార్తికేయ గుమ్మకొండ విలన్ రోల్ చేస్తుండం విశేషం. హుమా ఖురేషి, పెర్లీ మన్నే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 2021లో వాలిమై విడుదల అని అధికారికంగా తెలియజేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios