నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన ఫాంటసీ ఫిల్మ్ ‘బింబిసార’. ఈ చిత్రం ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ గా గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరవుతున్నారు.   

నందమూరి కళ్యాణ్ రామ్ - కేథరిన్ ట్రెసా జంటగా నటించిన ఫాంటసీ ఫిల్మ్ ‘బింబిసార’. చాలా కాలం తర్వాత సాలిడ్ హిట్ అందుకునేందుకు కళ్యాణ్ రామ్ ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నాలుగు పార్ట్ లుగా రానున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని మేకర్స్ రిలీజ్ కు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా చిత్ర ప్రీ రిలీజ్ ఈ వెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన డేట్, చీఫ్ గెస్ట్ గా అనౌన్స్ చేశారు. అలాగే నందమూరి బ్రదర్స్ కలిసి ఉన్న అద్భుతమై వీడియోనూ పంచుకున్నారు. 

Bimbisara ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 29న సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ గా నిర్వహించనున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో గల శిల్పా కళా వేదిక లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్యంగా అతిథిగా యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్ (NTR) హాజరవుతున్నారు. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈవెంట్ ను సక్సెస్ చేసేందుకు సిద్ధవవుతున్నారు. అయితే ఈ అనౌన్స్ మెంట్ ను అందిస్తూ మేకర్స్ అదిరిపోయే వీడియో బైట్ ను నందమూరి అభిమానులకు ట్రీట్ గా అందించారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ కలిసి ఉన్నఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్, పాటలు ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. కాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ‘బింబిసార’టీం రెగ్యూలర్ గా చిత్ర ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆగస్టు 5 ఈ చిత్రం అన్నీ భాషల్లో రిలీజ్ కానుంది. నాలుగు భాగాల్లో రానున్న ఈ చిత్రం మొదటి పార్ట్ ను మాత్రమే మేకర్స్ విడుదల చేస్తున్నారు. రెండు లేదా మూడో పార్ట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కూడా తీసుకొస్తానని కళ్యాణ్ రామ్ ఇదివరకు చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘బింబిసార’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

కళ్యాణ్ రామ్ తన కేరీర్ లోనే తొలిసారిగా ఓ మహాచక్రవర్తిగా నటిస్తున్నాడు. ఐదోవ శతాబ్దం BCEలో మగధ సామ్రాజ్యాన్ని ఏలిన రాజు అయిన బింబిసారుడు పాత్రలో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించనున్నాడు. ఇప్పటికే ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. చిత్రంలో హీరోయిన్లుగా కేథరిన్ ట్రెసా (Catherine Tresa), సంయుక్త మీనన్ నటిస్తున్న విషయం తెలిసిందే. మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహించారు. ఎంఎం కీరవాణీ అద్భుతమైన సంగీతం అందించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై చిత్రాన్ని నిర్మించారు. 

Scroll to load tweet…