తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారసుడు’. ఈ చిత్రం ఆడియో లాంచ్ ఈవెంట్ నిన్న గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేజీపై దళపతి ఇచ్చిన లైవ్ పెర్ఫామెన్స్ వైరల్ గా మారింది.  

తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy) - వంశీ పైడిపల్లి కాంబినేష న్ లో బైలింగ్వుల్ గా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘వారసుడు’. తమిిళంలో ‘వరిసు’గా విడుదల కాబోతోంంది. రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలను యూనిట్ జోరుగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా నిన్న తమిళనాడులో గ్రాండ్ గా నిర్వహించారు. ఆడియో ఈవెంట్ లో తమిళ స్టార్ అభిమానులకు గుర్తుండే పోయే ట్రీట్ ఇచ్చారు. స్టేజీపై లైవ్ పెర్ఫామెన్స్ ను ఇచ్చి ఖుషీ చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

‘వరిసు’లో ఫస్ట్ సింగిల్ గా విడుదలైన ‘రంజితమే’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ హిట్ సాంగ్స్ ను ఇస్తున్న సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ Ranjithame సాంగ్ తో మరోసారి ఊపూపారు. క్యాచీ ట్యూన్.. విజయ్ దళపతి అందించిన గాత్రంతో మరింతగా దూసుకుపోతోంది. అయితే, తాజాగా నిర్వహించిన ఈవెంట్ లో విజయ్ తన అభిమానుల కోసం ‘రంజితమే’ సాంగ్ ను లైవ్ లో పాడారు. అటు పాడుతూనే.. ఇటు క్రేజీ మూవ్స్ తో అదరగొట్టారు. దీంతో అభిమానుల కేకలు, అరుపులతో వేదిక హోరెత్తిపోయింది. ఈ వీడియోను జానీ మాస్టర్ అభిమానులతో పంచుకున్నారు. మరోవైపు ఫ్యాన్స్ తో విజయ్ సెల్ఫీ వీడియోను కూడా పంచుకోవడం వైరల్ గా మారింది. 

తెలుగు సినిమాతో తొలిసారిగా విజయ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఇక్కడ ఆయనకు మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘వారసుడు’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలకు మంచి రెస్సాన్స్ దక్కుతోంది. తాజాగా విడుదలైన జిమిక్కి పొన్ను, వా తలైవా సాంగ్స్ కూడా దూసుకుపోతున్నాయి. నేషనల్ క్రష్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) విజయ్ సరసన నటిస్తోంది. 

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, ఖుష్బు, స్నేహ, జయసుధ, యోగి బాబు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది.

Scroll to load tweet…
Scroll to load tweet…