Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ కు అర్షద్ వార్సీ మధ్య మరోసారి ఫైట్, వెన్యూ మారింది

 ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకుపైగా కొల్లగొట్టిన ప్రభాస్.. ఇప్పుడు పూర్తి డిఫరెంట్ జానర్ లో, మారుతి డైరెక్షన్ లో తొలిసారి ఈ ది రాజా సాబ్ తో రాబోతున్నాడు. 

The Raja Saab and  Jolly LLB 3 are going to face a massive box office clash  jsp
Author
First Published Aug 26, 2024, 4:34 PM IST | Last Updated Aug 26, 2024, 4:41 PM IST


ప్రభాస్ కు, అర్షద్ వార్శీ కు మధ్య జరిగిన వివాదం దేశం మొత్తం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అర్షద్ వార్శిని తప్పు పడుతూ చాలా మంది ట్వీట్స్ కూడా చేసారు. సౌతిండియా సినిమా ప్రియులు ప్రభాస్ కు సపోర్ట్ గా నిలిస్తే , హిందీ బెల్ట్ లో చాలా మంది అర్షద్ వార్శికు మద్దుతు ఇచ్చారు.   ఈ వివాదం సోషల్ మీడియాలో ఇప్పటికి హాట్ హాట్ గానే డిస్కషన్స్ రూపంలో బ్రతికి ఉంది. అయితే ఇప్పుడు మరోసారి వీరిద్దరి మధ్య యుద్దం మొదలు కానుంది. అయితే ఈ సారి సోషల్ మీడియాలో కాదు థియేటర్స్ లో .అదెలా ఉంటే..

ప్రభాస్ మొదటి సారి ఓ హారర్ రొమాంటిక్ కామెడీ మూవీతో రాబోతున్నాడు. ఈ సినిమా పేరు ది రాజా సాబ్. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. రీసెంట్ గా మేకర్స్ గ్లింప్స్ వీడియో ద్వారా ఈ రిలీజ్ డేట్ ను వెల్లడించారు. దీంతో కల్కి 2898 ఏడీ తర్వాత రిలీజ్ కాబోతున్న ప్రభాస్ నెక్ట్స్ మూవీ ఇదే కానుందని ఖరారు అయ్యింది. ఈ మధ్యే  కల్కి 2898 ఏడీతో వచ్చి ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకుపైగా కొల్లగొట్టిన ప్రభాస్.. ఇప్పుడు పూర్తి డిఫరెంట్ జానర్ లో, మారుతి డైరెక్షన్ లో తొలిసారి ఈ ది రాజా సాబ్ తో రాబోతున్నాడు. దాంతో  ది రాజా సాబ్ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోయాయి. 

ఇక రాజా సాబ్ రిలీజ్ డేట్ అంటే ఏప్రియల్ 10 నే  అర్షద్ వార్శి, అక్షయ్ కుమార్ కలిసి నటించిన జాలీ ఎల్ ఎల్ బి 3 రిలీజ్ కాబోతోంది. జాలీ ఎల్ఎల్ బి.. 2013 లో బాలీవుడ్ లో వచ్చిన ఈ   కామెడీ అండ్ క్రైమ్ మూవీ  మంచి విజయాన్ని సాధించింది. క్రైమ్  సినిమానే కానీ ఎక్కువ భాగం కామెడీ నే ప్రధాన అంశంగా తెరకెక్కింది. ఆ తర్వాత  పార్ట్ 2 కూడా వచ్చింది. 2017 లో రాగా స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా చేసాడు.  ఇప్పుడు జాలీ ఎల్ ఎల్ బి పార్ట్ 3 లో కూడా రాబోతోందిది.  

 జాలీ ఎల్ ఎల్ బి పార్ట్ 3  లో  అక్షయ్ కుమార్ నే హీరోగా చేస్తున్నాడు   మున్నాభాయ్ ఎమ్ బి బి ఎస్ ఫేమ్ అర్షద్ వర్సి ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. కోర్ట్ డ్రామా గా తెరకెక్కతున్న ఈ కథలో వాళ్ళిద్దరి అల్లరి ఈ మేర ఉంటుందో చూడాలి. సుభాష్ కపూర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై మంచి ఎక్సపెక్ఠేషన్స్ ఉన్నాయి. అర్షద్ వార్శి ఫుల్ కామెడీ చేస్తాడంటున్నారు. దాంతో ఖచ్చితంగా రాజా సాబ్ కు, జాలీ ఎల్ ఎల్ బి 3 కు మధ్య హిందీ బెల్ట్ లో పోటీ ఉంటుంది. ఓపినింగ్స్ విషయంలో ఒకరికొరకు టఫ్ ఫైటే ఇస్తాడంటున్నారు. 
 
ఇక అర్షద్ వర్శి  వివాద విషయానికి వస్తే..

   కల్కి 2898 ఏడీ. ప్రభాస్ కెరీర్ లో ఇదొక భారీ వసూళ్ల చిత్రంగా నిలిచిపోతుంది. అయితే, ఈ సినిమాలో ప్రభాస్ ను చూస్తే తనకు జోకర్ లా అనిపించాడని బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కల్కి చిత్రంలో ప్రభాస్ లుక్ జోకర్ లా అనిపించిందని, మెల్ గిబ్సన్ లా గంభీరంగా కనిపించాల్సిన ప్రభాస్ అందుకు భిన్నంగా కనిపించేసరికి తనకు చాలా బాధగా అనిపించిందని పేర్కొన్నాడు. ప్రభాస్ ను మ్యాడ్ మ్యాక్స్ సినిమా తరహాలో చూడాలనుకుంటున్నానని, కానీ కల్కి చిత్రంలో ఆయన వేషధారణ ఎందుకు అలా ఉందో అర్థం కావడంలేదని అర్షద్ వార్సీ పేర్కొన్నాడు. ప్రభాస్... నా అభిప్రాయం చెప్పడానికి చాలా బాధపడుతున్నాను అంటూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇవన్నీ వైరల్ అయ్యాయి. అర్షద్ వార్సీ వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులు, తెలుగు సినిమా స్టార్స్ మండిపడుతున్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios