Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ బాగోతం సాక్ష్యాలతో సహా బయట పెట్టిన యాంకర్ స్వప్న..

ప్రతీ సీజన్ లో బిగ్ బాస్ బాధితులు సంఖ్య పెరిగిపోతుంది. ప్రత్యక్ష్యంగా...పరోక్షంగా బిగ్ బాస్ పేరుతో మోసాలు ఎక్కువైపోయాయి.  తజాగా ఓ యాంకర్ బిగ్ బాస్ పేరుతో తనకు జరిగిన అన్యాయాన్ని సాక్ష్యాలతో సహా బయటపెట్టింది. 

The person who cheated the anchor by saying that he would be sent into Bigg Boss JMS
Author
First Published Jan 7, 2024, 7:19 AM IST


బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడం ఓ కలలా భావిస్తారుకొంత మంది . ఒక్క సారి అయినా అందులోకి వెళ్ళాలని అనుకునేవారు వందల్లో ఉంటారు. అయితే బిగ్ బాస్ లోకి వెళ్లాలంటే కాస్తయినా తెలిసిన ముఖం అయి ఉండాలి. లేకుంటే ప్రేక్షకులకు ఇంట్రెస్టింగ్  ఏముంటుంది. కాని ఈ విషయం తెలియక చాలా మంది బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు.. చేస్తే చేశారు.. కాని ఈక్రమంలో వారు..ఎలాగైనా బిగ్ బాస్ లోకి వెళ్ళాలన్న ఆరాటంలో.... అందరిని నమ్మిమోసపోతుంటారు. తాజాగా ఇలాంటి ఒక సంఘటన బయటకు వచ్చింది. ఓ యాంకర్ ఇలానే మోసపోయింది. 

అయితే యాంకర్ అయ్యుండి ఎలా మోసపోయింది అని అనుకోవచ్చు. కాని.. బిగ్ బాస్ టీంలో ఉండ కొంత మంది.. ఇలా ఫెయిడ్ అవుట్ అయిన యాంకర్లనుటార్గెట్ చేసి... వారి నమ్మకాన్నిసొమ్ము చేసుకుంటున్నారు. డబ్బులు వసూలు చేసి.. చివరకు హ్యాండ్ ఇస్తున్నారు. తాజాగా  దీనికి బాధితురాలు అయ్యింది యాంకర్ కమ్ యాక్టర్ స్వప్న చౌదరి అమ్మినేని.

ఓ చానెల్ లో రేలార్ అనే టీవీ షోకి యాంకర్‌గా చేసింది స్వప్న. అంతే కాదు ఎన్నో  ప్రైవేట్ ప్రోగ్రామ్స్ కు హోస్ట్ గా.. మరెన్నో మ్యూజికల్ ఈవెంట్స్ చేస్తూ.. కాస్ తో కూస్తో ఫేమ్ ను సంపాదించింది. అంతే కాదు కొన్నిచిన్న సినిమాల్లో కూడా నటించింది. మిస్టర్.. నమస్తే సేట్ జీ అనే మూవీల్లో నటించింది. ఆమెకు కూడా బిగ్ బాస్‌కి వెళ్లాలని ఆశ.  అయితే బీబీ హౌస్ లోకి పంపిస్తానని ఆ టీం సభ్యుల్లో ఒకరు  తనను మోసం చేశారంటూ సాక్ష్యాధారాలతో సహా వీడియో ద్వారా బయట పెట్టింది.  ఓ వీడియో రిలీజ్ చేసిన స్వప్న చౌదరి.. అందులో తన ఆవేదన బయటపెట్టింది. 

అందులో ఆమె ఏం చెప్పారంటే ‘బిగ్ బాస్‌కి వెళ్లడమంటే ఇష్టం. ఎంత ఇష్టమంటే.. నేను కనే కలలో కూడా.. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నట్లు కలగంటా. బిగ్ బాస్ అన్ని సీజన్లు మిస్ అవ్వకుండా చూశా. బిగ్ బాస్ సీజన్ 7లో హౌస్‌లో‌కి నన్ను పంపిస్తాను అని చెప్పి తమ్మాలి రాజు రూ. 2.50 లక్షలు తీసుకున్నాడు. గత ఏడాది జూన్ నెలలో ఇచ్చాను’ అంటూ దానికి సంబంధించిన అగ్రిమెంట్ కాగితాలను చూపించారు స్వప్న.

బిగ్ బాస్ సీజన్ 7 అయిపోయే వరకూ.. లాస్ట్ మూమెంట్ వరకు నువ్వు బిగ్ బాస్ హౌస్‌లో‌కి వెళతావనే చెప్పారు. ఏదో రకంగా పంపిస్తాను.. అవసరమైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో పంపిస్తాను.. అని డబ్బులు తీసుకున్నారట సదరు వ్యక్తి. అంతే కాదు..ఫోటో షూట్ పేరుతో మరో25 వేలు కూడా తీసుకున్నట్టు తెలిపారు ఆమె. ఈ డబ్బులు ఎందుకు అంటే.. రేటింగ్ పెంచడంకోసం,బట్టల కోసం..అంటూ ఏవో ఏవో చెప్పారని.. తాను డబ్బలు ఇవ్వలేను.. వేరో మార్గంలో నేను ట్రై చేసుకుంటా అంటే వద్దు నేనే పంపిస్తాను అని చెప్పి రాజు డబ్బులు అడిగారు అనిఅన్నారు స్వప్న.

అంతే కాదు  జూన్‌లో డబ్బులు ఇచ్చాను..కానీ బిగ్ బాస్ షోకి వెళ్లలేకపోయా.. అడిగితే.. బిగ్ బాస్ 8లో పంపిస్తాను అని చెప్పారు. అయితే ఓ అగ్రిమెంట్ రాసిచ్చారు. నేను పంపలేకపోయాను.. డిసెంబర్‌లో ఇస్తాను అని చెప్పారు. బిగ్ బాస్ కోసం నేను చాలా మంది దగ్గర నుండి అప్పు చేసి ఇచ్చాను. నా పరిస్థితి బాగోలేదని చెప్పా. అయినా పంపిస్తాను.. వైల్డ్ కార్డు ద్వారా పంపిస్తాను అంటూ చెప్పుకొచ్చారు’ అని పేర్కొంది. కాని ఇప్పుడు డబ్బులు ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నాడని ఆవేదన వ్యక్తంచేస్తోన్నారు సీనియర్ యాంకర్. 

Follow Us:
Download App:
  • android
  • ios