బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో పదకొండో రోజు షో కాస్త రసవత్తంగా సాగింది. ఓ వైపు వైల్డ్ కార్డ్ తో అవినాష్‌ ఎంట్రీ ఇవ్వడం, అభిజిత్‌, మోనాల్‌, అఖిల్‌ మధ్య ట్రయాంగిల్‌ లవ్‌ ట్రాక్‌, అవినాష్‌ .. గంగవ్వతో క్యాట్‌వాక్‌, గంగవ్వ అనారోగ్యానికి గురవ్వడంతో చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగింది. 

ఇప్పటి వరకు బిగ్‌బాస్‌4లో అభిజిత్‌, మోనాల్‌ గజ్జర్‌, అఖిల్‌ మధ్య లవ్‌ ట్రాక్‌తో నడిపించారు. అది కాస్త బోర్‌ కొడుతుంది. పులిహోర బ్యాచ్‌లుగా అభిజిత్‌, అఖిల్‌ వ్యవహరించి విసుగు తెప్పించారు. అయితే ఇప్పుడు లవ్‌ ట్రాక్‌ని మార్చారు. కొత్త లవ్‌ ట్రాక్‌ని తెరపైకి తీసుకొచ్చారు. జోర్దార్‌ సుజాతని ట్రాక్‌లోకి తీసుకొచ్చారు.  

ప్రారంభంలో రాత్రి ఎప్పటిలాగే అభిజిత్‌, సుజాత, దేవి నాగవల్లి, దేత్తడి హారిక కలిసి గుసగుసలాడారు. సుజాత‌ లవ్‌ ఎఫైర్‌ గురించి చర్చించారు. ఇందులో ఎవరినో ఒకరిని కనెక్ట్ చేసుకోవాలని, అందుకు నోయల్‌ మాత్రమే ఆప్షన్‌ అని సుజాతకి నాగవల్లి, హారిక, లాస్య సూచించారు. అభిజిత్‌ గురించి అడగ్గా తనకు అలాంటి ఓపీనియన్‌ లేదని తెలిపాడు. తనకు చెల్లిలా భావిస్తున్నాన్నారు. ఆ తర్వాత ఆమె నోయల్‌ వద్దకు వెళ్లి ఈ విషయం చెప్పగా, తాను క్లియర్‌గా ఉంటానని, సిస్టర్‌లా భావిస్తానని తెలిపాడు. ఎవరేమన్నా పట్టించుకోకు అని చెప్పాడు. 

మరోవైపు అభిజిత్‌, సుజాత్‌ మధ్య రహస్య చర్చలు జరిగాయి. ప్రారంభంలో సుజాత విషయంలో లవ్‌కి సంబంధించి తనకున్న అభిప్రాయంపై అభిజిత్‌ `ఏ ఛీ ఛీ.. నాకు చెల్లిలాంటిది` అనడాన్ని తాను ఫీల్‌ అయ్యానని సుజాత్‌ తెలిపింది. తన ఉద్దేశం అది కాదని ఆమెకి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు అభిజిత్‌. కాసేపు వీరి మధ్య హై డ్రామా సాగింది. సుజాత్‌ కన్నీళ్ళు పెట్టుకుంది. ఈ ఎపిసోడ్‌ చూస్తుంటే మొత్తంగా మరో కొత్త లవ్‌ ట్రాక్‌కి తెరలేపారని అర్థమవుతుంది. 

అదే సమయంలో నోయల్‌, సుజాత్‌ మధ్య ఏదో ఎమోషనల్‌ బాండింగ్‌కి తెరలేపారు. సుజాతకి అభిజిత్‌పైన, నోయల్‌ పైనా ఇంట్రెస్ట్ ఉందనేలా ఈ ఎపిసోడ్‌ సాగింది. మొత్తంగా అభిజిత్‌, మోనాల్‌, అఖిల్‌ నుంచి లవ్‌ ట్రాక్‌ని అభిజిత్‌, నోయల్‌, సుజాతల వైపు తిప్పారు. మరి ఎటు వైపు దారి తీస్తుందో చూడాలి.