తప్పు తెలుసుకున్న `టైగర్‌ నాగేశ్వరరావు` మేకర్స్.. సినిమాలో భారీగా కోత..

`టైగర్‌ నాగేశ్వరరావు` మేకర్స్ తప్పు తెలుసుకున్నారు. నష్టనివారణ చర్యలు చేపట్టారు. సినిమాలో భారీగా కోత పెట్టారు. సినిమాలో చాలా సీన్లు లేపేశారు. 

the makers of tiger nageswara rao got it what wrong huge cut in movie arj

మాస్‌ మహారాజా రవితేజ(Raviteja) హీరోగా నటించిన `టైగర్‌ నాగేశ్వరరావు`(Tiger Nageswara Rao) చిత్రం శుక్రవారం విడుదలై నెగటివ్‌ టాక్ ని తెచ్చుకుంది. స్టూవర్ట్ పురం గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రమిది. వంశీ దర్శకత్వం వహించారు. ఇందులో నుపుర్‌ సనన్‌ హీరోయిన్‌గా, రేణు దేశాయ్‌ కీలక పాత్రలో నటించారు. అయితే ప్రధానంగా ఈ చిత్రంలో నిడివి పెద్ద మైనస్‌ అనే విమర్శలు వచ్చాయి. దీంతో సినిమా మొత్తం స్లోగా సాగుతుందని, బోర్‌ తెప్పించిందని, స్క్రీన్‌ప్లే కన్విన్సింగ్‌గా లేదని అంటున్నారు.

అయితే `టైగర్‌ నాగేశ్వరరావు` మేకర్స్ తప్పు తెలుసుకున్నారు. నష్టనివారణ చర్యలు చేపట్టారు. సినిమాలో భారీగా కోత పెట్టారు. సినిమాలో చాలా సీన్లు లేపేశారు. మరింత క్రిస్పీగా తయారు చేశారు. తాజాగా కొత్త వెర్షన్‌ అప్‌డేట్‌ చేశారట. `టైగర్‌ నాగేశ్వరరావు` ఇప్పుడు రేసీగా ఉండబోతుందంటూ పోస్టర్‌ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా నిడివి రెండు గంటల 38 నిమిషాలు ఉండబోతుందట. అయితే మొదటగా ఈ చిత్రం మూడు గంటల రెండు నిమిషాలు ఉంది. ఇప్పుడు దాదాపు 24 నిమిషాలు కట్‌ చేశారు. అంటే చాలా సీన్లు తీసేశారు. ఇది భారీగా కోతే. 

తాము చేసిన తప్పుని టీమ్‌ తెలుసుకున్నారు. కానీ నష్టం జరిగినాక తెలుసుకోవడం విచారకరం. సినిమా ఆల్‌రెడీ రిలీజ్‌ అయి జనాల్లోకి వెళ్లింది. నెగటివ్‌ టాక్‌ ప్రచారం అయ్యింది. ఇప్పుడు సినిమాలో వేస్ట్ సీన్లు తీసేసినా ప్రయోజనం ఉంటుందా? అనేది పెద్ద ప్రశ్న. సినిమా బాగాలేదన్నప్పుడు ఏం చేసినా జనాలు థియేటర్‌కి రారు, మరి ఈ భారీ కోతతో ఆడియెన్స్ ని థియేటర్‌కి తీసుకొస్తారా? అనేది చూడాలి. అయితే ఈ చిత్రానికి ఇప్పటికే నెగటివ్‌ టాక్‌ వచ్చింది. డిజాస్టర్‌ దిశగా వెళ్తుందని ట్రేడ్‌ వర్గాల టాక్‌. తొలి రోజు ఓపెనింగ్‌ కలెక్షన్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయని అంటున్నారు.

`ధమాఖా` వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత `రావణాసుర`, `రామారావుః ఆన్‌ డ్యూటీ` చిత్రాలు పరాజయం చెందాయి. ఇప్పుడు `టైగర్‌ నాగేశ్వరరావు`తో హ్యాట్రిక్‌ కొట్టబోతున్నారనే కామెంట్లు వస్తున్నాయి. ఇందులో కథ, రవితేజ క్యారెక్టరైజేషన్‌ కన్విన్సింగ్‌గా లేదని అంటున్నారు. దీంతో రవితేజ పాన్‌ ఇండియా ప్రయత్నం బెడిసి కొట్టిందని చెప్పొచ్చు. అయితే రవితేజ ఈ చిత్రంపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. మొదట్నుంచి తన కాన్ఫిడెంట్‌ని వెల్లడించారు. కానీ తీరా ఈ చిత్రం కూడా డిజప్పాయింట్‌ చేయడం విచారకరం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios