తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ ‘వారసుడు’. విజయ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ తాజాగా క్రేజీ అప్డేట్ అందించారు. ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు.
తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy) తెలుగులో డైరెక్ట్ గా చేస్తున్న మొదటి మూవీ వారసుడు (Varasudu). వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రీయేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తమిళంలో ‘వరిసు’ (Varisu)గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం తుది దశ షూటింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మేకర్స్ సినిమాపై క్రేజీగా అప్డేట్స్ ను అందిస్తున్నారు.
తాజాగా ‘వారసుడు’ నుంచి మొదటి సాంగ్ ను రిలీజ్ చేసేందుకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా మొదట సాంగ్ ప్రొమోను మాత్రమే విడుదల చేస్తున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. ఈరోజు సాయంత్రం 6:30 నిమిషాలకు ప్రోమో రానుందని ప్రకటించారు. దీంతో పాటు ఓ క్రేజీ పోస్టర్ ను కూడా వదిలారు. చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా బ్యాక్ టు బ్యాక్ హిట్ సాంగ్స్ ను అందిస్తున్న థమన్ విజయ్ కోసం ఎలాంటి మ్యూజిక్ కంపోజ్ చేశాడోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
టాలీవుడ్ లో మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన వంశీ పైడిపల్లి తొలిసారి దర్శకత్వం హిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈమూవీ షూటింగ్ చాలా వరకూ అయిపోయింది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి లేటెస్ట్ పిక్స్ కూడా రివీల్ అవుతుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగిపోతోంది. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తోంది. శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, ఖుష్బు, స్నేహ, జయసుధ, యోగి బాబు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
