అరుళ్ శరవణన్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ యాభై ఏళ్ల బిజినెస్ మాన్ సినిమాపై మక్కువతో తనను తాను మార్చేసుకున్నాడు.
గత ఏడాది విడుదలైన ది లెజెండ్ ఓ సెన్సేషన్. ఈ సినిమా గురించి ఇండియా వైడ్ చర్చ నడిచింది. కారణం... అదో గొప్ప కంటెంట్ ఉన్న సినిమా అని కాదు. ఆ చిత్ర హీరో వలన. తమిళనాడులో అతిపెద్ద బిజినెస్ టైకూన్స్ లో ఒకరైన అరుళ్ శరవణన్ ది లెజెండ్ మూవీతో హీరోగా మారారు. వస్తూ వస్తూనే ఒక భారీ ప్రాజెక్ట్ సెట్ చేశారు. రూ. 60 నుండి 70 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రం చేశారు. అరుళ్ శరవణన్ లుక్, మేనరిజం పెద్ద ఎత్తున విమర్శలపాలయ్యాయి.
అయితే సినిమాకు ప్రచారం దక్కింది. ది లెజెండ్ శరవణన్ మూవీలో వ్యాపారవేత్త అరుళ్ ఎలా నటిస్తారో చూడాలనే ఆత్రుతతో ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లారు. అందుకే ఊహించని విధంగా లెజెండ్ చిత్రానికి ఓపెనింగ్స్ దక్కాయి. అయితే సినిమాలో కంటెంట్ నిల్ కావడంతో... ఆడలేదు. ది లెజెండ్ మూవీకి దక్కిన ప్రచారానికి ఏ మాత్రం సినిమాలో విషయం ఉన్నా, సెన్సేషన్స్ క్రియేట్ చేసేది.
వందల కోట్ల అధిపతి అయిన అరుళ్ శరవణన్ ఏదో ఒక సినిమాతో హీరో కావాలన్న ముచ్చట తీర్చుకున్నారని, ఇకపై ఆయన సినిమాలు చేయరని అందరూ భావించారు. అయితే షాక్ ఇస్తూ అరుళ్ శరవణన్ సెకండ్ ప్రాజెక్ట్ పై ప్రకటన చేశారు. ఆ మధ్య ఆయన సోషల్ మీడియా వేదికగా త్వరలో కొత్త ప్రాజెక్ట్ వివరాలు వెల్లడిస్తా అన్నారు. ఈసారి ఎలాంటి చిత్రంతో అరుళ్ శరవణన్ వస్తున్నారనే ఒక ఆసక్తి అందరిలో ఏర్పడింది.
ఇక హీరోగా ఎదిగాలని గట్టిగా ఫిక్స్ అయిన అరుళ్ శరవణన్ లుక్స్ కూడా మార్చేశాడు. ఆయన లేటెస్ట్ ఫోటో షూట్ చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. 20 ఏళ్ల కుర్రాడిలా మారిపోయిన అరుళ్ ని చూసి సోషల్ మీడియా జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంత యంగ్ గా ఎలా మారిపోయారని ఆయన్ని అడుగుతున్నారు. కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. మొత్తంగా అరుళ్ శరవణన్ మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు... కోటీశ్వరుడైన అరుళ్ కోరుకుంటే కొండ మీద కోతి కూడా దిగొచ్చేలా ఉంది.