నేచురల్ స్లార్ నానీ దసరా సినిమా సక్సెస్ తో బాలీవుడ్ లో మరోసారి చిచ్చు రగిలింది. టాలీవుడ్ సినిమా సత్తా చాటడంతో.. బాలీవుడ్ పై విమర్షలు స్టార్ట్అయ్యాయి.

 బాలీవుడ్ లో మరోసారి టాలీవుడ్ సినిమా వల్ల గొడవలు స్టార్ట్అయ్యాయి. చాలా కాలంగా బాలీవుడ్ లో హిట్ సినిమాలు లేవు. మన సౌత్ సినిమాలు అక్కడ కూడా రిలీజ్ అయ్యి సూపర్ హిట్లు కొడుతున్నాయి. బాలీవుడ్ బాక్సాఫీస్ ను కూడా మన సినిమాలే ఏలుతున్నాయి. ఈక్రమంలో.. షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా 1000కోట్ల కలెక్షన్స్ దాటి.. బాలీవుడ్ పరువు కాస్త నిలబెట్టింది. ఆతరువాత వచ్చినసినిమాలేవి బాలీవుడ్ పై ప్రభావం చూపించలేకపోతున్నాయి. దాంతో మరోసారి బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర..హిందీ సినిమాలు నీరసించిపోయాయి. 

ఇక తాజాగా నానిహీరోగా నటించి దసరా సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈసినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యింది. హిందీలో కూడా ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. బాలీవుడ్ లో ఈమూవీ హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదేసమయంలో హిందీలో రిలీజయిన స్టార్ హీరో అజయ్ దేవగణ్ భోళా సినిమా మాత్రం ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. మొదటి మూడు నెలల్లో బాలీవుడ్ లో పఠాన్ తప్ప చెప్పుకోదగ్గ హిట్ ఏమి లేకుండా పోయింది. దాంతో బాలీవుడ్ పై మరోసారి విమర్షలు స్టార్ట్ అయ్యాయి. 

ఇక ఎప్పుడూ... బాలీవుడ్ చేసే తప్పులను ఎత్తిచూపించేదానికి రెడీగా ఉంటారు కంగనా రనౌత్ అండ్ కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రీ. ఇక నానీ సినిమాపై కూడా వివేక్ స్పందించారు. బాలీవుడ్ ను నిలదీశారు. కాస్త గట్టిగానే మందలించారు. దీనిపై వచ్చిన ఓ బాలీవుడ్ న్యూస్ ని వివేక్ తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఓ ట్వీట్ చేశాడు.మళ్ళీ బాలీవుడ్ పరిస్థితి దారుణంగా తయారయ్యింది అన్నారు వివేక్. అంతే కాదు ఓపెనింగ్‌కి కూడా గ్యారెంటీ ఇవ్వలేని స్టార్‌ హీరోలకు.. భారీగా రెమ్యునరేషన్స్ ఇస్తున్నారు. అలాంటి వాళ్లకు ఆ రేంజ్ లో రెమ్యునరేషన్స్ ఇవ్వడంతో బాలీవుడ్ సంతోషంగానే ఉన్నట్టు ఉంది అన్నారాయన. 

Scroll to load tweet…

అంతే కాదు... స్టార్స్ లైఫ్ స్టైల్ మీద ప్రొడ్యూసర్లు ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారు. తప్పు జరుగుతుంది అని ట్వీట్ చేశాడు. గతంలో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. హీరోలు రెమ్యూనరేషన్ భారీగా ఉండటంతో.. సినిమాలకు గ్యారంటీ ఉండటంలేదు.. ఈవిషయంలో డిస్టీబ్యూటర్లు, నిర్మాతలు నష్టపతున్నారన్నారు. అయితే ఓపెనింగ్స్ తేలేని స్టార్స్ కి కూడా ఎక్కువ రెమ్యునరేషన్స్ ఇస్తున్నారని గతంలో కరణ్ జోహార్ కూడా అన్నాడు. ఇక వివేక్ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.