చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి, భారీ  విజయాన్ని మూట కట్టుకుంది ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ. ఇక ఈ మూవీ రీసెంట్ గా మరో  ఘనత ను సాధించింది. 

చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి, భారీ విజయాన్ని మూట కట్టుకుంది ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ. ఇక ఈ మూవీ రీసెంట్ గా మరో ఘనత ను సాధించింది. 
కంటెంట్ ఉంటే చాలు కథే హీరో.. అని నిరూపించింది ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ. అసలు ఏలాంటి అంచ‌నాల్లేకుండా రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ళ సునామీని సృష్టించింది. వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన ఈ మూవీ మార్చి 11న రిలీజ్ అయ్యి...బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతే కాదు భారీ స్థాయిలో క‌లెక్ష‌న్ల‌ను కూడా రాబ‌ట్టింది. ఇక ఈ మూవీ సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు టీమ్. 

ఇక ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ 50రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ సోష‌ల్ మీడియాలో ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు.నిర్మాత అగ‌ర్వాల్ ట్విట్ట‌ర్ లో స్పందించారు. ఇది నిజం యొక్క విజ‌యం. ఇది మాన‌వ‌త్వం యొక్క విజ‌యం. ఇది నిజంగా ప్ర‌జ‌ల సినిమా అని అన్నారు. ఇక ఈ సినిమాను అందించిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు అంటూ ట్వీట్ చేశాడు. 

Scroll to load tweet…

మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, అనుప‌మ్ ఖేర్, ద‌ర్శ‌న్ కుమార్, ప‌ల్ల‌వి జోషి ప్రధాన పాత్ర‌ల్లో న‌టించిన‌ ఈ సినిమాకు వివేక్ అగ్నిహోత్రీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కాశ్మీర్ పండిట్‌ల‌పై జ‌రిగిన‌ సామూహిక హ‌త్య‌కాండ నేప‌థ్యంలో ది కాశ్మీర్ ఫైల్స్ తెరకెక్కింది. 1990లో కాశ్మీర్ పండిట్‌లు ఏ విధంగా హింసించ‌బ‌డ్డారు? చంప‌బ‌డ్డారు? వాళ్ళు స్వ‌దేశం నుంచి బ‌లవంత‌గా ఎలా బ‌య‌ట‌కు పంపబ‌డ్డారు అనేది ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్.

 దాదాపు 20కోట్ల‌తో నిర్మించిన ఈ సినిమా ఇప్ప‌టివ‌రకు 254 కోట్లకు పైగా క‌లెక్ష‌న్ల‌ను సాధించి రికార్డు సృష్టించింది. అయితే ఈసినిమాకు ప్రధాని మోదీ దగ్గర నుంచి బిజేజీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు ఇలా అంతా సపోర్ట్ చేయడం, పన్ను రాయితీలు ఇవ్వడంతో చిన్న సినిమా కాస్తా.. భారీ సినిమా మారింది. ఈరేంజ్ లో కలెక్షన్స్ ను సాధించింది. అంతే కాదు ఈసినిమా చాలా వివాదాలకు కూడా కారణం అయ్యింది. 

ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా బాగుంది అని మెచ్చుకున్న వాళ్లే కాదు ఈసినిమాపై విమర్షలు గుప్పించిన వారు కూడా లేకపోలేదు. ఇక ఫైనల్ గా 50 డేస్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మే 13న ఓటీటీలో హిందీతో పాటు తెలుగు, త‌మిళం, క‌న్న‌డ భాష‌ల్లో జీ-5లో స్ట్రీమింగ్ కానుంది.