వివేక్‌ అగ్రిహోత్రి వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తూ.. పలువురు రాజకీయ నేతలు సహా భోపాలీ ప్రజలు, నెటిజన్లు ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వివేక్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయనకు అలాంటి అనుభవం ఉందేమో కానీ భోపాల్ వాసులకు అలాంటి అలవాటు లేదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కౌంటరిస్తూ వివేక్‌ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.


 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాతో ఒక్కసారిగా దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి( Vivek Agnihotri).నిశ్శబ్దంగా వచ్చి వెళ్లిపోవాల్సిన ఈ చిత్రం బీజేపీ, సోషల్‌ మీడియా ఉచిత ప్రచారం వల్ల ఇప్పుడు బాక్సాఫీస్‌ హిట్‌గా నిలిచింది. ఈ తక్కువ బడ్జెట్ చిత్రం 150కోట్లకు పైగా వసూలు చేయటం విశేషం. మిథున్‌ చక్రవర్తి, అనుపమ్‌ ఖేర్‌, పల్లవి జోషీ వంటి క్యారెక్టర్‌ నటులు తప్ప పెద్ద స్టార్లు ఎవరూ ఈ చిత్రం లేరు. అయినా ఈ చిత్రం ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేస్తోందంటే కారణం అందులోని విషయమే.

అయితే ఈ చిత్రం దర్శకుడు ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివేక్ భోపాలీ అంటే చేసిన అర్ధం ఇప్పుడు వివాదాస్పదం అయింది. తమపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ భోపాలీ ప్రజలు మండిపడుతున్నారు. భోపాలీ అంటే హోమో సెక్స్‌వల్ అని అర్ధమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తానూ భోపాల్ వాడినేనని.. కానీ, తాను ఆ విషయాన్ని ఎక్కడా చెప్పనని అన్నారు. ఎందుకంటే భోపాలీ అంటే స్వలింగసంపర్కుడని, నవాబుల ప్రవర్తన అనే అర్థాలున్నాయని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో భోపాలీ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోయారు.

వివేక్‌ అగ్రిహోత్రి వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తూ.. పలువురు రాజకీయ నేతలు సహా భోపాలీ ప్రజలు, నెటిజన్లు ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వివేక్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయనకు అలాంటి అనుభవం ఉందేమో కానీ భోపాల్ వాసులకు అలాంటి అలవాటు లేదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కౌంటరిస్తూ వివేక్‌ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

 మరో ప్రక్క “ది కశ్మీర్‌ ఫైల్స్‌ ” చిత్రం ఇప్పుడు సరికొత్తకు చర్చకు తెరతీసింది.సున్నిత అంశంతో కూడిన ఈ సినిమాను అధికార భారతీయ జనతా పార్టీ బాహాటంగానే ప్రమోట్‌ చేస్తోంది. దాంతో ఇది రాజకీయ వివాదంగా కూడా మారింది. నిజానికి, మొదట్లో ఈ సినిమా పెద్దగా ఎవరి దృష్టిలో పడలేదు. మీడియాలో కూడా పెద్ద ప్రచారం లేదు. కానీ, సోషల్‌ మీడియాలో దీనిపై విస్తృత చర్చ నడిచింది. దాంతో అది ప్రధాన మీడియాను కూడా ఆకర్షించింది.ఇంతలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన బాటలోనే ఆయన ముఖ్యమంత్రులు, మంత్రులు నడిచారు. ఫలితంగా పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు దీనికి వినోదపన్ను మినహాయింపు ఇచ్చాయి. అంతే కాదు పోలీసులు ఈ సినిమా చూసేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక రోజు సెలవు కూడా ఇచ్చింది. ఈ చిత్రం మీద వస్తున్న విమర్శలపై కూడా ప్రధాని స్పందించారు. ఈ విమర్శలు సినిమాను అప్రతిష్టపాలు చేయడానికి చేస్తున్న కుట్రలో భాగం అన్నారు.