సీతారామం సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతుంది. కాని ఇప్పటికీ ఈ సినిమా క్రేజ్ తగ్గలేదు. ఇటు సౌత్ తో పాటు.. బాలీవుడ్ మేకర్స్ ను కూడా ఆకట్టుకుంటుంది ఈ సినిమా. రీసెంట్ గా ఈ సినిమాపై ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రీ తన అభిప్రాయం పంచుకున్నారు.
రీసెంట్ గా టాలీవుడ్ నుంచి వచ్చిన సీతారామం సినిమా సౌత్ తో పాటు బాలీవుడ్ ను కూడా ఆకర్షిస్తోంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈసినిమా ఫస్ట్ డే పెద్దగా నిపించకపోయినా.. స్లోగా ఆడియన్స్ కు ఎక్కేసింది. అంతే కాదు తెలుగు,తమిళ ప్రేక్షకులతో పాటు నార్త్ ఆడియన్స్ కూడా ఈసినిమాను విపరీతంగా చూసేస్తున్నారు. అటు నార్త్ మేకర్స్ కూడా ఈసినిమాపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. రీసెంట్ గా కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ ఈమూవీ గురంచి స్పందించాు.
ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాతో విమర్షకుల ప్రశంసలతో పాటు.. ప్రధాని మోడీలాంటి వారి నుంచి కూడా ఆయన సత్కారాలు పొందరు. చిన్న సినిమాగా తెరకెక్కి.. దేశం మెచ్చిన సినిమాగా ది కశ్మీర్ ఫైల్స్ మారిపోయింది. కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమాపై పన్ను కూడా ఎత్తివేశారు. అయితే ఎన్ని ప్రశంసలు అందుకుందో అన్ని విమర్షలు కూడా ఫేస్ చేసిందీ సినిమా. ఇక ఈసినిమా డైరెక్టర్ వివేక్ రీసెంట్ గా సీతారామం సినిమా చూశారు. చూసి వెంటనే తన అభిప్రాయం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
సీతారామం సినిమాపై వివేక్ అగ్నహోత్రి ప్రశంసలు కురిపించారు. హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాను రాత్రి చూశానని వివేక్ అగ్నిహోత్రి తెలిపారు. దుల్కర్ నటనకు ఆయన ఫిదా అయ్యారు. యంగ్ హీరో యాక్టింగ్ చాలా రిఫ్రెషింగ్ గా, అద్భుతంగా ఉందని కితాబునిచ్చారు. తొలిసారి మృణాల్ ఠాకూర్ నటనను చూశానని... చాలా సహజంగా నటించిందని ఆయన అన్నారు. అంతే కాదు ముందు ముందు మృణాల్ పెద్ద స్టార్ అవుతుందని చెప్పారు.
ఈ సినిమా గురించి వివేక్ ట్విట్టర్ ద్వారా స్పందిచారు. దాంతో ఆయన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. టాలీవుడ్ నుంచి రిలీజ్ అయిన సీతారామం సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించగా.. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, సుమంత్, తరుణ్ భాస్కర్, భూమిక చావ్లా, ప్రకాశ్ రాజ్, మురళి శర్మ, వెన్నెల కిశోర్ తదితరులు ముఖ్యమైన పాత్రల్లో మెరిపించారు. చాలా కాలంగా హిట్ లేక ఇబ్బంది పడుతున్న దర్శకుడు హను రాఘవపూడికి.. ఈసినిమాతో బ్లక్ బస్టర్ దక్కింది. ఇక ఈ మూవీని అశ్వనీదత్ నిర్మించారు.
