టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన అల్లు అర్జున్ క్రేజ్ కొన్నాళ్లుగా విపరీతంగా పెరుగుతూ పోతుంది. సౌత్ ఇండియాలో తెలుగుతో పాటు మలయాళంలో అల్లు అర్జున్ కు ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన నటించిన సినిమాలు కేరళలో కూడా భారీ ఎత్తున విడుదల అవుతాయి. ఇక అలవైకుంఠపురంలో మూవీ తరువాత ఆయన రేంజ్ మరో స్థాయికి చేరింది. ఆ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్ నాన్ బాహుబలి రికార్డ్స్ నమోదు చేశారు. ఆ మూవీ మేనియా బాలీవుడ్ వరకు పాకింది. 

బాలీవుడ్ ప్రముఖులు సైతం బన్నీ నటనతో పాటు మూవీని పొగడ్తలతో ముంచేశారు. అవకాశం ఇస్తే బన్నీతో మూవీ చేస్తానంటూ ఓ దర్శకుడు చెప్పడం విశేషం. కాగా నేడు ఇండియన్ స్టైల్ ఐకాన్ అల్లు అర్జున్ (#indianstyleiconalluarjun) అంటూ ఓ యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో భారీగా ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఈ యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తూ ఇండియా లెవెల్ లో సత్తాచాటుతున్నారు. ఎటువంటి సంధర్భం లేకుండా అల్లు అర్జున్ పై ఓ యాష్ ట్యాగ్ ఈ స్థాయిలో  ట్రెండ్ కావడం ఆసక్తి రేపుతోంది. 

కాగా పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ బాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ఇప్పటికే అక్కడ కొంత పాపులారిటీ తెచ్చుకోగా ఈజీగా సక్సెస్ అవుతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అల్లు అర్జున్ తన చిత్రాలతో బాలీవుడ్ హీరోలకు పోటీఇవ్వడం ఖాయం అంటున్నారు. త్వరోనే పుష్ప షూటింగ్ మొదలుకానుంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.