Asianet News TeluguAsianet News Telugu

హీరోయిన్‌గా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న `ది ఘోస్ట్` బ్యూటీ.. `బుట్టబొమ్మ` ఫేట్‌ మారుస్తుందా?

తమిళ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన అనిక ఇటీవల తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ నాగార్జున `ది ఘోస్ట్`లోనూ బాలనటిగా మెరిసింది. తాజాగా హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.

the ghost child artist turns as heroine with buttabomma will this break for her?
Author
First Published Jan 19, 2023, 10:36 PM IST

బాలనటిగా తమిళం, మలయాళంలో ఎన్నో సినిమాలు చేసింది అనికా సురేంద్రన్‌. స్టార్‌ హీరోల సినిమాల్లోనూ నటించింది. ఆ మధ్య అజిత్‌ కి కూతురిగా `విశ్వాసం`లోనూ నటించి ఆకట్టుకుంది. పాపులర్‌ తమిళ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన ఈ బ్యూటీ ఇటీవల తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ నాగార్జున `ది ఘోస్ట్`లోనూ బాలనటిగా మెరిసింది. తాజాగా హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ఆమె హీరోయిన్‌గా పరిచయం అవుతూ `బుట్టబొమ్మ` చిత్రంలో నటించింది. ఈ సినిమా ఈ నెల 26న రిపబ్లిక్‌ డే సందర్భంగా విడుదల కానుంది. 

ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రూరల్ డ్రామా ఫిల్మ్ కి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిక సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చిత్ర ప్రమోషనల్‌ లో భాగంగా మీడియాతో అనికా గురువారం ముచ్చటించింది. తన ఎగ్జైట్‌మెంట్‌ని పంచుకుంది. ఫస్ట్ టైమ్‌ హీరోయిన్‌గా నటించిన చిత్రం విడుదలకు సిద్ధమవుతుందంటే ఆనందంతోపాటు కాస్త టెన్షన్‌గానూ ఉందని చెప్పింది. ఎన్నో ఏళ్లుగా బాల నటిగా చేస్తున్న తనకు హీరోయిన్ గా ఆఫర్‌ రావడం ఎంతో హ్యాపీగా అనిపించిందని చెప్పింది.

`ఇది మలయాళ మూవీ `కప్పేల`కి రీమేక్‌. ఆ సినిమా చూశా, నాకు చాలా నచ్చింది. నేను నటించిన పాత్రలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి, నటనకు ఆస్కారం ఉంది. నాకు ఎంతో నచ్చిన ఆ సినిమా రీమేక్ లో హీరోయిన్ గా నటించే అవకాశం రావడం, అది సితార వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలోని సినిమా కావడంతో ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేశాను. ఇది రీమేక్‌ అయినా మూల కథ అలాగే ఉంటుంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశారు. ఒరిజినల్ ఫిల్మ్ కంటే కూడా ఇది ఇంకా కలర్ ఫుల్ గా ఆకట్టుకునేలా ఉంటుంది. 

ఫస్ట్ టైమ్‌ హీరోయిన్‌ పాత్ర చేయడంతో చాలా ప్రెషర్‌ ఫీలయ్యా. పైగా నాది సినిమాలో ప్రధాన పాత్ర. అందుకే కాస్త ఒత్తిడిగా అనిపించింది. కానీ దర్శకుడు రమేష్ గారు, మిగతా చిత్ర యూనిట్ మద్దుతుతో ఈజీగానే సినిమాని పూర్తి చేయగలిగాను. రీమేక్‌ సినిమాల్లో పోలికలుంటాయి. అందుకే నేను కూడా ఒరిజినల్ ఫిల్మ్ లోని నటిని కాపీ కొట్టే ప్రయత్నం చేయలేదు. పాత్రను అర్థం చేసుకొని ఆ సన్నివేశాలకు తగ్గట్లుగా నటించాను. నా పాత్ర మిమ్మల్ని ఆకట్టుకుంటుందని నమ్ముతున్నా` అని చెప్పింది అనిక. ఈ సినిమాపై ఎంతో హోప్స్ పెట్టుకున్నానని తెలిపింది. మరి `బుట్టబొమ్మ` అనిక ఫేట్‌ మారుస్తుందా అనేదిచూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios