సుమంత్‌ హీరోగా నటిస్తున్న నూతన చిత్రం `కపటధారి` ఫస్ట్ లుక్‌ వచ్చేసింది. ఫస్ట్ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ని సోమవారం సాయంత్రం యువ సామ్రాట్‌ నాగచైతన్య ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

సుమంత్‌ హీరోగా నటిస్తున్న నూతన చిత్రం `కపటధారి` ఫస్ట్ లుక్‌ వచ్చేసింది. ఫస్ట్ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ని సోమవారం సాయంత్రం యువ సామ్రాట్‌ నాగచైతన్య ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో ఆర్టికల్‌ 352 అని, ఎఫ్‌ఐఆర్‌ అని రాసి ఉంది. ఇక సుమంత్‌ ఓ చేతితో క్రిమినల్‌పై గన్‌ ఎక్కుపెట్టి, మరో చేతితో మైక్రో స్పీకర్‌లో మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఇందులో సుమంత్‌ లుక్‌ సీరియస్‌గా ఉంది. మొత్తంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది.

ఇది కన్నడలో విజయం సాధించిన `కపటధారి` అనే సినిమాకి రీమేక్‌. ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నందిత శ్వేత హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక చాలా రోజులుగా హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్న సుమంత్‌.. సక్సెస్‌ కోసం ఈ రీమేక్‌ని ఆశ్రయించినట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమాతోనైనా విజయం వరిస్తుందా? అన్నది చూడాలి.

Scroll to load tweet…