Asianet News TeluguAsianet News Telugu

#Bimbisara:అప్పుడు నవ్విన వాళ్లే ఇప్పుడు పొగడ్తలు!!!

 కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార మూవీ థియేటర్లలో విడుదలై ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. తొలిరోజు ఈ సినిమా కలెక్షన్లు భారీగానే ఉన్నాయంటున్నారు.  

   The collections are massive for #Bimbisara
Author
Hyderabad, First Published Aug 6, 2022, 5:31 PM IST


గత కొద్దికాలంగా ఇండస్ట్రీలో సక్సెస్ కనపడటం లేదు. పెద్ద సినిమాలు తప్ప జనాలకు మామూలు సినిమాలు ఆనటం లేదు. ఈ నేపధ్యంలో నిన్న శుక్రవారం విడుదలైన సీతారామం, బింబిసార రెండు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార మూవీ థియేటర్లలో విడుదలై ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. తొలిరోజు ఈ సినిమా కలెక్షన్లు భారీగానే ఉన్నాయంటున్నారు. 16 కోట్ల రూపాయల టార్గెట్ తో విడుదలైన ఈ సినిమా వీకెండ్ షేర్ కు  ఆ టార్గెట్ ను బ్రేక్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.  సోషల్ మీడియాలో ఈ సినిమాను ఓ రేంజిలో పొగుడుతున్నారు. 

అదే సమయంలో ఓ టాక్ వినిపిస్తోంది. అదేమిటంటే.... ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యినప్పుడు అందరూ ప్రభాస్ బాహుబలితో పోల్చి చూసి నవ్వారు. చాలా మంది ట్రోల్ చేసారు. ఇప్పుడు అదే సినిమా హౌస్ ఫుల్ బోర్డ్ లుతో ప్రదర్శింపబడుతోంది. దాంతో బింబిసారను పొగుడుతూ ట్విట్టర్, ఫేస్ బుక్ లలో పోస్ట్ లు పెడుతున్నారు. అప్పుడు ఆ ట్రోలింగ్ చూసి వాళ్లు కంగారు పడి ఉండి ఉంటే ఇంత మంచి అవుట్ ఫుట్ వచ్చేది కాదంటున్నారు. నవ్విన నాపచేను పండింది అని సామెత గుర్తు చేస్తున్నారు. 

మరి కొంతమంది కథల విషయంలో తారక్ జడ్జిమెంట్ కు తిరుగుండదని ఈ సినిమా సక్సెస్ తో మరోసారి ప్రూవ్ అయింది. ఈ సినిమా కథ విని ఓకే చేసిన వాళ్లలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్లే కళ్యాణ్ రామ్ బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కించారు. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తారక్ చెప్పిన మాటలు అక్షరాలా నిజం కావడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios