టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బ్లాక్ బాస్టర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రంపై ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సీఈవో స్పందించారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించిన ఎపిక్ యాక్షన్ ఫిల్మ్ ‘రౌద్రం రణం రుధిరం’ (RRR) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, ఆకట్టుకునే సన్నివేశాలను తెరకెక్కించడంలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) మరోసారి తన మార్క్ చూపించారు. మార్చి 25న రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి బ్లాక్ బాస్టర్ టాక్ ను దక్కించుకుంది. అటు ఓవర్సీస్ లోనూ అదిరిపోయే రెస్పా్స్ ను సొంతం చేసుకుంది.
ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’కు నార్త్ లో మంచి ఆదరణ దక్కింది. ఈ మూవీతో ఒక్కసారిగా ఎన్టీఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగారంటే సినిమా ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉందో ఇట్టే అర్థమవుతోంది. ఇటీవల ప్రముఖ ఓటీటీ సంస్థ లోకి వచ్చిన ఆర్ఆర్ఆర్.. ఇక్కడా అదిరిపోయే రెస్పాన్స్ తో స్ట్రీమింగ్ షురూ చేసింది. టాప్ టెన్ చిత్రాల్లో చోటు దక్కించుకుంది. ఒక దశలో #1 ఇండియన్ సినిమాగా గుర్తింపు పొందింది. ఇక బాక్సాఫీసు వద్ద కూడా కాసుల వర్షం కురిపించింది. క్లోజింగ్ సమయానికి రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన భారత చిత్రంగా నాల్గో స్థానంలో నిలిచి మరో రికార్డును క్రియేట్ చేసింది.
ఈ చిత్రం మే 20 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థలు జీ5 మరియు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్ ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్ రిలీజ్ కాగా.. మిగితా లాంగ్వేజ్ లు జీ5లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే సినిమా రిలీజ్ అయి ఇప్పటికి 100 రోజులు పూర్తైనా ‘ఆర్ఆర్ఆర్’ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ముక్యంగా హిందీ వెర్షన్ ను ఓటీటీ ప్రేక్షకులు ఇంకా ఆదరిస్తూనే ఉన్నారు. తాజాగా సినిమాపై నెట్ ఫ్లిక్స్ సీఈవో (Netfilx CEO) టెడ్ సరండోస్ (Ted Sarandos) స్పందించారు. ‘ఇప్పటి వరకు హిందీ వెర్షన్ లో ఆర్ఆర్ఆర్ సినిమాను చూడనివాళ్లు వెంటనే చూడండి. ఈ ఏడాది వచ్చిన క్రేజీయేస్ట్ థ్రిల్లర్ లలో ఒకటి. దుమ్మురేపుతోంది.’ అంటూ ఫేస్ బుక్ లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.
ఆయన పోస్ట్ ను ఆర్ఆర్ఆర్ సోషల్ మీడియా టీం ‘ఆర్ఆర్ఆర్’ ఇన్ స్టా హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. ఇందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు ఉద్యమ వీరులు కొమురం భీం, అల్లూరి సీతారామా రాజుగా నటించారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ (Alia Bhatt) హీరోయిన్ గా నటించింది. అజయ్ దేవగన్, శ్రియా శరన్ పలు కీలక పాత్రల్లో నటించారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. ఎంఎం కీరవాణీ అద్భుతమైన సంగీతం అందించారు.
