మెగా స్టార్ చిరంజీవి చాలా అరుదుగా ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటాడు. అలాంటిది తాజాగా తన భార్య, కొడుకు, కోడలు ఉన్న ఓ క్యూట్ పిక్ ను అభిమానులతో పంచుకున్నాడు. దీంతో ఆ పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) ఫ్యామిలీ మెంబర్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన చూపిన బాటలో అందరూ నడుచుకుంటూ సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే మెగా స్టార్ వరుసగా సినిమాల్లో బిజీగా ఉంటున్నప్పటికీ సమయం ఉన్నప్పుడు, కొన్ని ప్రత్యేక రోజుల్లో ఫ్యామిలీతో సమయం గడుపుతున్నారు. ఆ ఫొటోలను, వీడియోలను పలు సందర్భాల్లో మెగా అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. తాజాగా తన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఓ క్యూట్ పిక్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ పిక్ లో కొడుకు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), కోడలు ఉపాసన, భార్య సురేఖ ఉన్నారు. 

అయితే చిరంజీవి కోడలు, రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కొణిదెల (Upasana) పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ ఈ క్యూట్ పిక్ ను తన అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఉపాసనకు బెస్ట్ విషెస్ తెలిపారు. ‘మా ఇంటి కోడలు పిల్ల ఉపాసనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని విష్ చేస్తూ ఫొటోను పంచుకున్నాడు. అటు రామ్ చరణ్ కూడా ‘నా ప్రియమైన ఉపాసనకు జన్మదిన శుభాకాంక్షలు’ అని అదే పిక్ ను పంచుకున్నాడు. చాలా రోజుల తరువాత మెగా స్టార్ తన ఫ్యామిలీ పిక్ ను పంచుకోవడం పట్ల అభిమానులు ఫిదా అవుతున్నారు. ఎంతో సంతోషంగా కనిపిస్తున్న మెగా కుటుంబ సభ్యులను చూసి మురిసిపోతున్నారు. నెటిజన్లు కూడా ఉపాసనకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ చిరు, చెర్రీ ట్వీట్లకు కామెంట్లు పెడుతున్నారు. 

కామినేని ఇంట జన్మించిన ఉపాసన తాజాగా 33వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంది. ‘మెగా’ కోడలుగా ఉపాసన కీర్తి గడిస్తోంది. 2012లో రామ్ చరణ్ ను వివాహం చేసుకున్న ఉపాసన తన మ్యారేజ్ లైఫ్ ను చక్కగా లీడ్ చేస్తోంది. ఇటు తను టేకాఫ్ చేసిన బిజినెస్ లనూ లాభాల బాటలో నడిపిస్తోంది. URLife వ్యవస్థాపకురాలిగా, CSR గ్రూప్ వైస్ చైర్‌పర్సన్ గా, అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. అలాగే సమయం ఉన్నప్పుడల్లా రామ్ చరణ్, ఉపాసన టూర్స్, వేకేషన్స్ కు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పట్లో కొన్ని పిక్స్ షేర్ చేసిన విషయం తెలిసిందే.

Scroll to load tweet…