Asianet News TeluguAsianet News Telugu

#Pushpa2 ‘పుష్ప2’బడ్జెట్ అంత పెరిగిందా? కారణం ?

 ‘పుష్ప: ది రూల్‌’ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్  తో తెరకెక్కించడంతోపాటు, ఒకేసారి  పలు భాషల్లో విడుదల చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు నిర్మాతలు.  

The budget of Allu Arjun #Pushpa2 also said to be getting increased jsp
Author
First Published Jan 31, 2024, 6:12 AM IST

పుష్ప పార్ట్ 1  ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప-2 శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 15న విడుదల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ఇప్పటికే ప్రకటించారు.అయితే ఓ రెండు రోజుల నుంచి పుష్ప-2 విడుదల వాయిదాప‌డిందంటూ సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అదే సమయంలో మరో వార్త సైతం హల్ చల్ చేస్తోంది. 

ఈ సినిమా షూటింగ్ లేటు కావటంతో  మొదట అనుకున్న బడ్జెట్ బాగా  పెరిగిపోయిందని చెప్తున్నారు. 30% — 40% దాకా బడ్జెట్ పెరిగిందని, అయినా ప్రొడక్షన్ కంపెనీ మైత్రీ వారు తగ్గేదేలే మీరు కానివ్వండి అని సుకుమార్ కు హామీ ఇచ్చారని తెలుస్తోంది. సుకుమార్ ఈ సీక్వెల్ విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదని, అల్లు అర్జున్ రిలీజ్ డేట్ కోసం టెన్షన్ పడినా,సుకుమార్ మాత్రం హడావిడితో చేయకూడదని కూల్ గా నడిపిస్తున్నాడని అంటున్నారు.  స్క్రిప్టు మీద కంటిన్యూగా కూర్చుంటున్నారని, కంటిన్యూగా ఫుటేజ్ ని చెక్ చేసి ఎక్కడైనా అసంతృప్తిగా ఉంటే వెంటనే రీషూట్ పెడుతున్నారని అంటున్నారు. రాజీ పడని తత్వంతో ఎలాగైనా పెద్ద బ్లాక్ బస్టర్ ఇవ్వాలనే ఆలోచనతో టీమ్ కష్టపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ చిత్రానికి పెరిగిన అంచనాలకు, దాంతో  జరుగుతున్న బిజినెస్ కు తగిన అవుట్ ఫుట్ ఉండాలని లేకపోతే తేలిపోతుందని సుకుమార్ ..పార్ట్ 1 టైమ్ నాటి కన్నా నాలుగు రెట్లు కష్టపడుతూ పుష్ప2 ని ముందుకు తీసుకు వెళ్తున్నారట. 
 
ఈ మేరకు   చిత్ర నిర్మాతలు పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తోంది.   ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఒకేసారి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే వ్యూహంతో నిర్మాణం చేపడుతున్నారు. ఫస్ట్ పార్ట్  సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. భాషతో సంబంధం లేకుండా పుష్ప మేనరిజమ్‌తోనూ, డైలాగ్‌తోనూ ప్రపంచం మొత్తం ఊగిపోయింది. ఆ రెస్పాన్స్ ని దృష్టిలో ఉంచుకునే కొనసాగింపుగా వస్తున్న ‘పుష్ప: ది రూల్‌’ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్  తో తెరకెక్కించడంతోపాటు, ఒకేసారి  పలు భాషల్లో విడుదల చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు నిర్మాతలు.  ఈ క్రమంలో కేవలం తెలుగు రెండు రాష్ట్రాల నుంచే 200 కోట్ల దాకా బిజినెస్ ఎక్సపెక్ట్ చేస్తున్నట్లు  తెలుస్తోంది. RRR చిత్రం తెలుగులో రెండువందల కోట్లు బిజినెస్ చేసింది. ఇప్పుడు పుష్ప 2 కూడా అలాగే చేయాలని లెక్కలేసుకుని నిర్మాతలు రంగంలోకి దిగినట్లు ఫిల్మ్ నగరవర్గాల సమాచారం. 
 
 ‘పుష్ప: ది రూల్‌’ సినిమాని మాత్రం భారత్‌లో విడుదల చేసిన రోజునే, ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించింది. రష్యాతోపాటు... 20కి పైగా  దేశాల్లో సినిమాని ఒకేసారి విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టు సమాచారం.   ఇప్పటికే ‘పుష్ప2’ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఆ మధ్యన  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఫహాద్ ఫాజిల్‌ ఆ అంచనాలను పెంచేశారు. రెండో భాగంలో భన్వర్‌ సింగ్‌ పాత్ర ఎక్కువగా ఉంటుందని చెప్పారు. హీరోకు ఆ పాత్రకు మధ్య చాలా యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయన్నారు. ఇక ఈ సీక్వెల్‌లో భన్వ‌ర్‌ సింగ్ షెకావ‌త్‌ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తయినట్లు సమాచారం. 2021లో విడుదలై సూపర్‌హిట్‌ అందుకున్న ‘పుష్ప: ది రైజ్‌’కి కొనసాగింపుగా తెరకెక్కుతున్నదే ‘పుష్ప: ది రూల్‌’ (పుష్ప 2). అల్లు అర్జున్‌ సరసన రష్మిక నటిస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios