కింగ్ నాగార్జున అత్యవసర షూటింగ్ కోసం కులుమనాలి వెళ్లడంతో బిగ్ బాస్ హోస్ట్ బాధ్యతలు సమంత తీసుకున్నారు. దసరా పండుగ నాడు ప్రసారమైన ఆ షోలో సమంత హోస్ట్ గా మంచి మార్కులే తెచ్చుకున్నారు. మరి ఈ ఎపిసోడ్ కి ఎంత టీఆర్పీ వచ్చిందో తెలుసా... 

వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం నాగార్జున కులు మనాలి వెళ్లడం వలన ఒకవారం బిగ్ బాస్ హోస్ట్ బాధ్యతలకు దూరం అయ్యారు. దీనితో అక్కినేని సమంత ఈ బాధ్యత తీసుకున్నారు. తెలుగు అంతగా రాకపోయినా తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్, మాటలతో బాగానే ఆకట్టుకుంది. దసరా కానుకగా ప్రసారమైన ఈ ఎపిసోడ్ లో ఎర్ర చీరలో సమంత ట్రెడిషనల్ లుక్ ముఖ్యంగా ఆకట్టుకుంది. 

ఇక ఈ షోలో సమంతకు కొంచెం మద్దతుగా హైపర్ ఆది, పాయల్ రాజ్ పుత్ మరియు యంగ్ హీరో కార్తికేయ కూడా రంగంలోకి దిగారు. దీనితో దసరా ఎపిసోడ్ ఏ స్థాయి టీఆర్పీ దక్కించుకుంటుంది అనేది ఆసక్తి రేపింది. తాజాగా సమంత హోస్ట్ గా ప్రసారం అయిన బిగ్ బాస్ ఎపిసోడ్ టీఆర్పీ బయటికి వచ్చింది. ఈ ఎపిసోడ్ అనూహ్యంగా 11.4 టీఆర్పీ దక్కించుకుంది. 

పండగ దినం మరియు సమంత హోస్ట్ వంటి విషయాలు పరిగణలోకి తీసుకుంటే ఇది కొంచెం తక్కువ టీఆర్పీనే అనాలి. కానీ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ 8 నుండి 9 టీఆర్పీ మాత్రమే దక్కించుకుంటుందని సమాచారం. అలా చూసుకుంటే సమంత హోస్ట్ గా మంచి టీఆర్పీనే దక్కింది. ఇక నాగార్జున హోస్టుగా సాగిన ప్రారంభ ఎపిసోడ్ కి 18 కి పైగా టీఆర్పీ వచ్చిన సంగతి తెలిసిందే.