బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌'. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 

విజయ్ రత్నాకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. 'మహాభారతంలో రెండు కుటుంబాలు ఉండేవి. కానీ భారత్ లో ఒకటే ఉంది' అంటూ కాంగ్రెస్ పార్టీ జెండా కనిపించడంతో సినిమా ట్రైలర్ మొదలైంది.

ట్రైలర్ లో మన్మోహన్ పాత్రను హైలైట్ చేస్తూ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల పాత్రలను టచ్ చేశారు. సునీల్‌ బోహ్రా, జయంతిలాల్‌ గదా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 11న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.