మహేష్ వంటి సూపర్ స్టార్ కొత్తగా ఏ చిత్రం కమిటవ్వబోతున్నారనేది ఎప్పుడూ అభిమానులకు ఆసక్తికరమే. అందుకే ఆయన ఎవరు కథ నేరేట్ చేసినా వెంటనే బయిటకు వచ్చేస్తుంది. హంగామా జరిగిపోతుంది. రీసెంట్ గా పెళ్లి చూపులుతో పాపులర్ అయిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ...మహేష్ బాబుని కలిసి కథ వినిపించారని సమాచారం.

అయితే స్టోరీ లైన్ గా కథ బాగుందని , కాకపోతే తన ఇమేజ్ కు తగ్గట్లుగా కొద్ది పాటి మార్పులు చేస్తే బాగుంటుందని మహేష్ సూచించారని తెలుస్తోంది. కథే హీరో అన్న రీతిలో తరుణ్ భాస్కర్ అల్లుకుంటూ పోయారని, అయితే భారీ బడ్జెట్ లతో తీసే సినిమాలు అన్ని విషయాలు పట్టించుకోవాలని , అభిమానులను కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పినట్లు వినికిడి. 

దాంతో ఇప్పుడు తరుణ్ భాస్కర్ ఆ పనిలో పడినట్లు చెప్పుకుంటున్నారు. తమ టీమ్ తో కూర్చుని స్క్రిప్టులో సోల్ చెడకుండా మార్పులు..చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.  వాస్తవానికి పెళ్లి చూపులు చిత్రం ఘన విజయం సాధించాక...ఓ స్టార్ తో సినిమా చేస్తాడనుకున్నారు. రానా తో ఫైనల్ అయ్యిందని వార్తలు వచ్చాయి. అయితే అనుకోని విధంగా  త‌న స్కూల్ లోనే, మ‌ళ్లీ కొత్త‌వాళ్ల‌తో  ‘ఈ న‌గ‌రానికి ఏమైంది’ అంటూ ఓ ప్ర‌యోగం చేశారు. 

ఆఖ‌రికి తను పరిచయం చేసిన  ప్రియ‌ద‌ర్శిని ని కూడా రిపీట్ చేయ‌లేదు. ఓ విధంగా ఇది రిస్కే అయినా ధైర్యం చేసారు. ‘ఈ న‌గ‌రానికి ఏమైంది’ అనే టైటిల్‌, సురేష్ బాబు, త‌రుణ్ భాస్క‌ర్‌ల పేర్లు ఓపినింగ్స్ రప్పించాయి కానీ సినిమాని హిట్ చేయలేకపోయాయి. దాంతో గ్యాప్ తీసుకున్న ఆయన స్క్రిప్టు లు రాసుకుంటున్నారు.