అరవింద సమేత జూనియర్ ఎన్టీఆర్ కు మరచిపోలేని విజయాన్ని అందించింది. ఈ కథానాయకుడి కెరీర్ లోనే అత్యంత భారీ కలెక్షన్స్ ను రాబడుతున్న చిత్రంగా అరవింద సమేత నిలవనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫస్ట్ వీక్ లోనే ఎన్టీఆర్ కు కొత్త రికార్డును అందించిన అరవింద దసరా ముగిసే వరకు మరిన్ని రికార్డులు అందిస్తుంది. 

ఇకపోతే సినిమాను చూసి సినీ ప్రముఖులు తారక్ సన్నిహితులు చిత్ర యూనిట్ ని అభినందిస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కు ప్రియమిత్రుడైన రామ్ చరణ్ కూడా సినిమాను స్పెషల్ గా తన భార్యతో వీక్షించి ఎన్టీఆర్ ను అలాగే చిత్ర యూనిట్ ను సోషల్ మీడియా ద్వారా అభినందించారు. దీంతో తారక్ కూడా వారు అందించిన విషెష్ కి కృతజ్ఞతలు తెలిపాడు. 

మీ మాటలకు చాలా సంతోషపడుతున్నా.. కృతజ్ఞతలు అంటూ.. మీకు అరవింద సమేత చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నా అని తారక్ ప్రతిస్పందించారు. అందుకు సంబందించిన ట్వీట్ ప్రస్తుతం మెగా అభిమానులను అలాగే నందమూరి అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఫ్యాన్స్ ఫ్రెడ్లిగా ఉండడంలో స్టార్స్ మధ్య ఈ విధమైన సంభాషణలు చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు.