గత కొంత కాలంగా మీటూ ఉద్యమం తగ్గినట్లుగా అనిపిస్తోంది. మొదట్లో ఎంతో మందికి చెమటలు పట్టించిన ఈ ఉద్యమాన్ని అస్సలు వదలద్దని సొట్టబుగ్గల సుందరి తనదైన శైలిలో వివరణ ఇచ్చింది. 

ఎక్కడైనా సరే పని చేసే ప్లేస్ లో మహిళలు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటే సైలెంట్ గా ఉండకూడదు. వేదించినవారు ఎవరైనా సరే వారికి శిక్ష పడాల్సిందే. ఎవరిని వదలకూడదు. అల జరగకుంటే లైంగిక ఆరోపణలు చేసిన వారిని ఈ ప్రపంచం తప్పుగా భావించి కించపరుస్తుంది. ఇలా జరిగితే కలత చెందే అవకాశం ఉంది. 

అందుకే మీటూ ను కొనసాగించాలి. దాని వల్ల ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయి.  అయితే ఇప్పుడు అడ్డంకులు వచ్చాయని ఉద్యమాన్ని వదిలేయకూడదు. ఇప్పుడే దైర్యంగా ఉండాలి. ఇప్పుడు విడిచిపెడితే ఎప్పటికి సమాజంలో మార్పు తీసుకురాలేమని భవిష్యత్తులో కష్టమవుతుందని తాప్సి తన వివరణను ఇచ్చింది.