తను శ్రీ దత్త లైంగిక వేధింపుల ఆరోపణల వివాదం రోజుకో కొత్త వివాదాన్ని సృష్టిస్తోంది. నానాపటేకర్ తనను వేధించాడని ఆమె చెప్పిన విధానం బాలీవుడ్ ని షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో కొందరు తను శ్రీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇక హాట్ బ్యూటీ రాఖీ సావంత్ కూడా రీసెంట్ గా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సవాల్ విసిరారు. 

తను శ్రీ పెద్ద అబద్దాల కోరు. ఆమె చెప్పేవన్నీ అవాస్తవాలు. మంచి నటుడిమీద లేనిపోని ఆరోపణలు చేస్తోంది. ఆమె రక్తం మొత్తం డ్రగ్స్ తో నిండి ఉంది. ఎదో పబ్లిసిటీ కోసం ఆరోపణలు చేయడం కాదు. దమ్ముంటే నిరూపించాలని తన ఎదురుగా సమాధానం చెప్పే దమ్ము తను శ్రీ కి ఉందా అని రీసెంట్ గా రాఖీ సవాల్ విసిరారు.  

అందుకు తనుశ్రీ 10కోట్ల పరువునష్టం దావా వేశారు. చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమని వీలైనంత త్వరగా రాఖీ సావంత్ సమాధానం ఇవ్వకపోతే రెండేళ్ల జైలు శిక్షపడే అవకాశం ఉంటుందని తను శ్రీ తరపు న్యాయవాది తెలిపారు. దీంతో ఒక్కసారిగా ఈ న్యూస్ వైరల్ గా మారింది.