యువ సామ్రాట్‌ నాగచైతన్య, రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం `థ్యాంక్యూ`. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

`మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో మర్చిపోతే.. మనం చేరిన గమ్యానికి విలువుండదని నా ఫ్రెండ్‌ చెప్పారు` అని అన్నారు నాగచైతన్య. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `థ్యాంక్యూ`. విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వం వహించిన ఈచిత్రమిది. రాశీఖన్నా మెయిన్‌ హీరోయిన్‌ గా నటించగా, మాళవిక నాయర్‌, అవికా గోర్‌ సైతం హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల(జులై) 22న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేశారు. 

తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. `మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో మర్చిపోతే.. మనం చేరిన గమ్యానికి విలువుండదని నా ఫ్రెండ్‌ చెప్పారు` అంటూ నాగ చైతన్య చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. `ఫ్లైట్‌ ఎక్కడమే ఫస్ట్ టైమ్.. చిన్నప్పుడంతా నారాయణపురం..` అని, `లుక్‌ బ్యాక్‌ అభి.. ఈ సక్సెస్‌ కి కారణమైన వాళ్లు ఇంకా ఎంతో మంది ఉన్నారు. ఇదొక లాంగ్‌ జర్నీ మై ఫ్రెండ్` అంటూ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. 

ట్రైలర్‌ చూస్తుంటే నాగచైతన్య స్కూల్‌ డేస్‌ నుంచి, కార్పొరేట్ గా ఎదిగే జర్నీని చూపించబోతున్నట్టు తెలుస్తుంది. నారాయణపురం అనే గ్రామంలో జన్మించిన అభి అనే కుర్రాడి జీవితాన్ని ఆవిష్కరించేలా సినిమా సాగుతుందని తెలుస్తుంది. స్కూల్‌ డేస్‌లో ఒక ప్రేమని, కాలేజ్‌ టైమ్లో ఇంకో ప్రేమని, జాబ్‌ హోల్డర్‌గా మారాక మరో ప్రేమని ఆవిష్కరించారు. ఈ జర్నీలో ఎన్నో వదులుకుని కెరీర్‌లో సక్సెస్‌ కావడానికి అభి పడే స్ట్రగుల్స్ ని ఆవిష్కరించేలా సినిమా ఉంటుందని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. అదే సమయంలో అదిరిపోయేలా ఉంది. ఎమోషనల్‌ లవ్‌ జర్నీగా సినిమా సాగుతుందని అర్థమవుతుంది. అదే సమయంలో సినిమాపై అంచనాలను పెంచుతుంది. 

YouTube video player