ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాజాగా అల్లు అర్జున్ తన సినిమా గురించిన చెప్పిన మాటలు ప్రోత్సాహకంగా ఉన్నాయని అన్నారు. బన్నీ సినిమా నచ్చడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు.   

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), అల్లు అర్జున్ (Allu Arjun) సోషల్ మీడియా వేదికన ఒకరి సినిమాను మరొకరు సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయడం గతం నుంచే జరుగుతోంది. అల్లు అర్జున్ చివరిగా ‘పుష్ఫ : ది రైజ్’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంపై గతంలో మహేశ్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. అదే విధంగా మహేశ్ బాబు సొంత బ్యానర్ లో నిర్మించిన చిత్రం ‘మేజర్’పైన అల్లు అర్జున్ ఇటీవల ప్రశంసల వర్షం కురిపించాడు. చిత్ర యూనిట్ తో పాటు మంచి చిత్రాన్ని అందించినందుకు మహేశ్ బాబును కూడా అభినందిస్తూ ట్వీట్ చేశాడు. 

అడివి శేష్ (Adivi Shesh) హీరోగా తెరకెక్కిన మేజర్ జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ముంబై ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా మేజర్ తెరకెక్కిన విషయం తెలిసిందే. దర్శకుడు శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించగా.. మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కించారు. విడుదలకు ముందే మేజర్ చిత్ర ప్రీమియర్స్ షోలతో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. విమర్శకుల నుంచి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లో అందుకోవడం విశేషం. సినీ ప్రముఖులు కూడా ట్వీట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ చేసిన ట్వీట్ పైన మహే బాబు తాజాగా స్పందించారు.

ట్వీట్ కు రిప్లై ఇస్తూ.. ‘థ్యాంక్ యూ అల్లుఅర్జున్, మీ మాటలు మాకు, మేజర్ యువ బృందానికి తప్పకుండా ప్రోత్సహిస్తాయి. మీకు సినిమా నచ్చిందని తెలిసి సంతోషంగా ఉంది.’ అని పేర్కొన్నాడు. ఇక మేజర్ చిత్రంలో హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించగా,, హీరోయిన్స్ శోభితా ధూళిపాళ్ల, సాయి మంజ్రేకర్ కథనాయకులుగా నటించారు. దర్శకుడు శశి కిరణ్ తిక్కా డైరెక్ట్ చేయగా, సంగీతం శ్రీచరణ్ పాకాల అందించారు. అటు బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపిస్తోంది.

Scroll to load tweet…