అడివి శేష్ అహంకారం బాధించింది.. ప్రముఖ నిర్మాత కామెంట్స్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 11, Aug 2018, 11:36 AM IST
thammareddy bharadwaj sensational comments on adivi sesh
Highlights

సినిమా ఫస్ట్ కాపీ చూపిస్తానని ఆప్యాయంగా మాట్లాడాడు. సినిమా పూర్తయి ప్రీరిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్స్ ఇవన్నీ జరుగుతున్నా.. ఆ కార్యక్రమాలకు సంబంధించి నాకు ఎలాంటి ఆహ్వానం రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ విషయాలు అతడి ఈగోని బయటపెడుతున్నాయి. 

నటుడిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు అడివి శేష్. రీసెంట్ గా అతడు నటించిన 'గూఢచారి' సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు కథ అతడే రాసుకోవడం విశేషం. దీంతో ఇండస్ట్రీ వర్గాల్లో అతడు హాట్ టాపిక్ గా మారాడు. ప్రముఖులు అతడిపై ప్రశంసలు కురిపిస్తుంటే దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాత్రం ఇతడిపై నెగెటివ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమ్మారెడ్డి.. అడివి శేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

''40 ఏళ్లుగా నేను ఇండస్ట్రీలో ఉన్నాను. ఎంతోమంది గొప్ప వ్యక్తులతో సన్నిహితంగా మెలిగాను. కానీ అడివి శేష్ నన్ను అవమానించడం బాధించింది. గూఢచారి సినిమా షూటింగ్ సమయంలో అడివి శేష్ నా దగ్గరకి వచ్చి ఒక సహాయం కావాలి అంకుల్ అని అడిగాడు. తను తీస్తోన్న సినిమాలో ఒక గెస్ట్ రోల్ చేయమని అడిగాడు. నాకు నటించడం రాదని చెప్పినా.. బలవంతపెట్టి మరీ నాతో ఆ పాత్ర చేయించాడు. సినిమా ఫస్ట్ కాపీ చూపిస్తానని ఆప్యాయంగా మాట్లాడాడు.

సినిమా పూర్తయి ప్రీరిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్స్ ఇవన్నీ జరుగుతున్నా.. ఆ కార్యక్రమాలకు సంబంధించి నాకు ఎలాంటి ఆహ్వానం రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ విషయాలు అతడి ఈగోని బయటపెడుతున్నాయి. నేను ఎవరి దగ్గరకో వెళ్లి పాత్రలు అడుక్కునే స్టేజ్ లో లేను. నాలాంటి వారితో ఇలా ప్రవర్తిస్తున్న ఈ హీరో మరో రెండు హిట్స్ పడితే ఇంకెంతలా మారిపోతాడో.. ఇండస్ట్రీలో అహంకారంతో వ్యవహరించే వ్యక్తులు ఎక్కువ కాలం నిలబడలేరు'' అని వెల్లడించారు. 

loader