టాలీవుడ్ మిల్కి బ్యూటీ తమన్నా ఎన్ని అవకాశాలను అందుకుంటున్న కూడా గతంలో లాగా హిట్స్ అందుకోలేకపోతోంది. కుర్ర హీరోల నుంచి అప్పటి సీనియర్ హీరోలతో బాగానే నటిస్తోంది అయినా కూడా అమ్మడికి క్రేజ్ పెద్దగా రావడం లేదు. ఇక ఇప్పుడు F2 సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. రీసెంట్ గా సినిమా ప్రీ రిలీజ్ వేడుకను చిత్ర యూనిట్ గ్రాండ్ గా నిర్వహించింది. 

అయితే ఈవెంట్ లో తమన్నా ఎలాంటి మొహమాటం లేకుండా హీరోలను నిర్మాతను అవకాశాలిమ్మని ఇన్ డైరెక్ట్ గా అడిగేసింది. ముందుగా వరుణ్ తేజ్ తో ఈ సినిమాలో నటించాక చాలా నేర్చుకున్నట్లు చెబుతూ తన కో స్టార్ వెంకటేష్ గారితో కూడా మరోసారి నటించాలని ఉందని చెప్పింది. అదే విధంగా దిల్ రాజుని F3 ని సెట్స్ పైకి తేవాలని కోరింది. 

షూటింగ్ లో వెంకీతో అలాగే చిత్ర యూనిట్ ఛాప్;లా బాగా ఎంజాయ్ చేశామని దర్శకుడు అనిల్ రావిపూడి మంచి ఎంటర్టైనర్ తో కూడిన సినిమాను తెరకెక్కించినట్లు చెప్పారు. కుదిరితే మరో సినిమాలో అందరం కలిసి నటించాలని ఉందని తన ఆలోచనను తెలిపింది. ఇక శనివారం విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ కథానాయకుడు - చరణ్ వినయ విధేయ రామ రిజల్ట్ పై నెగిటివ్ టాక్ వస్తుండడడంతో ఈ సినిమాకు అనుకూలంగా మారే అవకాశం ఉంది.