పద్మశ్రీ పురస్కార గ్రహీత కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మెగులయ్య ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మొగులయ్యకు ఇంత పాపులర్ రావడానికి కారణం ‘పవన్ కళ్యాణే’ అంటా..
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘బీమ్లా నాయక్’. ఈ చిత్రాన్ని 2020 అక్టోబర్ లో నే అఫిషియల్ గా అనౌన్స్ చేసినా ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు ఎట్టకేళకు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 25న ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. అయితే, సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులు పెద్ద ఎత్తున్న ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీ నుంచి విడుదలైన టైటిల్ సాంగ్, మరో సాంగ్ ఆడియెన్స్ కు తెగ నచ్చాయి.
అయితే ఈ మూవీలోని టైటిల్ సాంగ్ ను రూపొందించేందుకు చిత్ర యూనిట్ చాలా కష్టపడింది. తెలంగాణ యాస, బాష,, సాహిత్యం కనిపించే చేసేందుకు టైటిట్ సాంగ్ ను కిన్నెర కళాకారుడు ‘దర్శనం మొగిలయ్యతో పాడించాడు థమన్. ఈ సాంగ్ ను రూపొందిన తర్వాత సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున విడుదల చేశారు. సాంగ్ రిలీజైన వెంటనే రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ప్రమోషన్ లో భాగంగా ఈ సాంగ్ ను మ్యూజిక్ వీడియోను రూపొందించారు. ఈ వీడియోలో థమన్ టీంతో పాటు దర్శనం మొగిలయ్య కూడా కనిపిస్తారు. దీంతో ఒక్కసారిగా మొగిలయ్య పాపులర్ అయ్యాడు. ఇటీవల పద్మశ్రీ పురస్కారానికి కూడా ఎంపికై అవార్డుు అందుకున్న విషయం తెలిసిందే.
అయితే మొగిలయ్యకు ఇంత పెద్ద సినిమాలో అవకాశం ఎలా వచ్చిందనే డౌట్ అందరిలోనూ ఉంటుంది. ఈ విషయాన్ని థమన్ ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపాడు. సాంగ్ రూపొందిస్తున్న క్రమంలో దర్శనం మొగిలయ్యతో పాడిస్తే బాగుటుందని పవర్ స్టారర్ ‘పవన్ కళ్యాణ్’ చెప్పినట్టు థమన్ పేర్కొన్నాడు. మొగిలయ్య అడ్రస్ తో సహా చెప్పినట్టు చెప్పారు థమన్. అయితే, ఈ విషయం తెలుసుకున్న పవన్ ఫ్యాన్స్ తెలంగాణ జానపద, సాహిత్యాన్ని మొదటి నుంచి పవన్ కళ్యాణ్ కాపాడుతున్నారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
