గోవింద నామస్మరణ మీద చేసిన తమన్  వ్యాఖ్యలు, జై బాలయ్య స్లోగన్‌తో పోల్చిన తీరు మీద కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు దారి తీస్తుందో చూడాలి. 

ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ...తన సంగీతంతోనే కాకుండా తన కామెంట్స్ తోనూ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటూ వస్తున్నారు. హీరోల అభిమానులను మెప్పించటం కోసం ఏదో ఒకటి అనటం తర్వాత యాంటి ఫ్యాన్స్ చేతిలో ట్రోలింగ్ కు గురి అవ్వటం జరుగుతోంది. రీసెంట్ గా తమిళంలోకి వెళ్లి విజయ్ ఫ్యాన్ అని అంటున్నాడు.. ఇక్కడకు వస్తే.. బాలయ్య, చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ ఇలా అందరికీ అభిమానిని అని అంటున్నాడు.. దీంతో సోషల్ మీడియా జనం తమన్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అలాంటి తమన్ ఇప్పుడు ఈ గోవింద నామస్మరణ వ్యాఖ్యలతో మరోసారి దొరికాడు. వివరాల్లోకి వెళితే...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

నందమూరి అభిమానులు ఎక్కడికు వెళ్లినా అది పబ్ అయినా, పెళ్లైనా మరొకటి అయినా జై బాలయ్య స్లోగన్‌ ఎత్తుకుంటారు. దాంతో ఆ స్లోగన్ బాగా ఫేమస్ అయ్యింది. అది ఎంత దాకా వెళ్లిందంటే... జై బాలయ్య అనే సాంగ్ ను సమయం సందర్భం సంబంధం కుదరకపోయినా సరే వీర సింహా రెడ్డి సినిమాలో పెట్టారు. అది బాగా క్లిక్ అయ్యింది. వీర సింహా రెడ్డి సినిమాలో బాలయ్య పేరు ఏంటి? ఆ పాటలో ఉన్న పేరు ఏంటి? అనేది కూడా ఎవ్వరూ పట్టించుకోలేనంతగా వర్కవుట్ అయ్యింది. అయితే జై బాలయ్య అనే పాటను పెట్టడం వెనక కారణం చెప్తూ తాజాగా తమన్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

Scroll to load tweet…
Scroll to load tweet…

తమన్ మాట్లాడుతూ... గోవింద నామస్మరణం, జై బాలయ్య అనే స్లోగన్‌ అనేవి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తాయని అన్నారు. అందుకే జై బాలయ్య అనే పాటను పెట్టినట్టుగా తమన్ చెప్పుకొచ్చాడు. దీంతో కొంత మంది నెటిజన్లు తమన్ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అవి రెండూ ఒకటేనా? అంటూ నిలదీస్తున్నారు. భక్తితో అనే గోవిందా గోవిందా నామస్మరణకు, జై బాలయ్యకు తేడా ఉండదా? అంటూ కోప్పడుతున్నారు.