మహేష్ సర్కారు వారి పాట షూట్ కి సిద్ధం అవుతున్నారు. జనవరిలోనే సర్కారు వారి పాట రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ప్రస్తుతం మహేష్ దుబాయ్ లో ఉన్నారు. నేడు ఆయన సతీమణి పుట్టినరోజు నేపథ్యంలో ఆయన సెలెబ్రేషన్స్ కోసం అక్కడకు వెళ్లారు. మరోవైపు సర్కారు వారి పాట మొదటి షెడ్యూల్ సైతం దుబాయ్ లోనే ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మొదట అమెరికాలో సర్కారు వారి పాట షూట్ అన్నారు. ప్లేస్ ఏదైనా షూటింగ్ మాత్రం వెంటనే మొదలుకానుంది. 

ఈ నేపథ్యంలో సర్కారు వారి పాట చిత్రానికి సంగీతం అందిస్తున్న థమన్ టీం మొత్తానికి బెస్ట్ విషెష్ తెలియజేశారు. ఎటువంటి అవరోధాలు లేకుండా సాఫీగా షూటింగ్ సాగాలని ఆయన కోరుకున్నారు. అలాగే సర్కారు వారి పాట మూవీ టీం తో పని చేస్తున్నందుకు గర్వంగా ఫీలవుతున్నట్లు థమన్ ట్వీట్ చేశారు. ఈమధ్య సూపర్ ఫార్మ్ లోకి వచ్చిన థమన్, క్రేజీ ప్రాజెక్ట్స్ సొంతం చేసుకున్నారు. 

ఇక గీత గోవిందం ఫేమ్ పరుశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలు, ఆర్థిక నేరాలపై  సెటైరికల్ మూవీనే సర్కారు వారి పాట అని సమాచారం. సర్కారు వారి పాట మూవీ ప్రీ లుక్ తోనే మహేష్ ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నారు. ఇక మహేష్ క్యారక్టర్ కూడా దర్శకుడు భిన్నంగా డిజైన్ చేశారట. సర్కారు వారి పాట మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.