విజయ్ సరసన హీరోయిన్ గా రష్మిక సందడి చేయనున్న ఈ సినిమాలో, శరత్ కుమార్ .. సుమన్ .. ప్రకాశ్ రాజ్ .. ప్రభు .. శ్యామ్ .. జయసుధ .. ఖుష్బూ ముఖ్యమైన పాత్రలను పోషించారు. 


తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తీస్తున్న చిత్రం తెలుగులో ‘వారసుడు’, తమిళంలో ‘వరిసు’. ఈ టైటిల్, ఫస్ట్ లుక్, రీసెంట్ గా ట్రైలర్ విడుదల చేసినప్పటి నుంచి ఈ సినిమా కథ గురించి రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. బాగా రొటీన్ కథ తీసాడని కొందరు అన్నారు. ఈ దర్శకుడు తానే తీసిన ‘బృందావనం’ సినిమా కథని అటు, ఇటు మార్చి తీస్తున్నాడని మొదట చర్చ జరిగింది.అయితే, రిలీజ్ కు దగ్గర పడిన ఈ సమయమంలో మళ్ళీ కొన్ని తమిళ వెబ్ సైట్లు తాజాగా రాసిన స్టోరీలైన్ విని తెలుగు సినిమా లవర్స్ షాక్ కి గురి అవుతున్నారు. 

తమిళ వెబ్ సైట్లు రాసిన కథ ఏంటంటే… విజయ్ రాజేంద్రన్ అనే ఒక వ్యక్తి చుట్టూ సినిమా తిరుగుతుంది. విజయ్ ఒక మామూలు వ్యక్తి. విజయ్ ని ఒక కుటుంబం దత్తత తీసుకొని పెంచుకుంటుంది. ఆ కుటుంబ పెద్ద మరణిస్తాడు. అప్పటివరకు వేరే ఎక్కడో ఉన్న విజయ్ ఇప్పుడు కుటుంబాన్ని కలవడానికి వస్తారు. కానీ ఇక్కడ పరిస్థితులు ఏమీ అనుకూలంగా అనిపించవు. ఉన్నట్టుండి విజయ్ బిజినెస్ లోకి రావాల్సి వస్తుంది. 

ఆ క్రమంలో తన అన్నలకి, తనకి మధ్య గొడవలు వస్తాయి. ఈ గొడవలన్నీ విజయ్ ఎలా పరిష్కరించాడు అనే విషయం చుట్టూ సినిమా తిరుగుతుంది. విజయ్ తండ్రి పాత్రలో శరత్ కుమార్ నటిస్తున్నారు. అలాగే విజయ్ అన్నల పాత్రల్లో శ్రీకాంత్, శ్యామ్ నటిస్తున్నారు. విజయ్ తల్లి పాత్రలో జయసుధ నటిస్తున్నారు. విజయ్ కి వ్యతిరేకంగా ఉన్న కంపెనీకి ఓనర్ గా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. ఈ కథలో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోవాలి అంటే సినిమా విడుదల అయ్యే అంతవరకు ఆగాల్సిందే.

విజయ్ సరసన హీరోయిన్ గా రష్మిక సందడి చేయనున్న ఈ సినిమాలో, శరత్ కుమార్ .. సుమన్ .. ప్రకాశ్ రాజ్ .. ప్రభు .. శ్యామ్ .. జయసుధ .. ఖుష్బూ ముఖ్యమైన పాత్రలను పోషించారు. తమన్ నుంచి వచ్చిన పాటల్లో రంజితమే సాంగ్ బాగా హిట్ అయిన సంగతి తెలిసిందే .

'వారసుడు' సినిమాకు సంబంధించి దిల్ రాజు ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాకు హీరోగా తొలుత విజయ్ ను అనుకోలేదని చెప్పారు. మహేశ్ బాబుతో ఈ చిత్రాన్ని చేయాలని వంశీ పైడిపల్లి అనుకున్నారని, అయితే వేరే ప్రాజెక్ట్ తో మహేశ్ బిజీగా ఉండటం వల్ల కుదరలేదని చెప్పారు. ఆ తర్వాత రాంచరణ్ తో అనుకున్నామని, కానీ ఆయన అప్పటికే తన తదుపరి సినిమా డిస్కషన్ లో ఉండటంతో సాధ్యపడలేదని తెలిపారు. దీంతో, చివరకు ఈ సినిమా విజయ్ వద్దకు వెళ్లిందని అన్నారు. 

ఈ సారి సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి చిత్రం 'వాల్తేరు వీరయ్య' జనవరి 13న వస్తోంది. బాలయ్య సినిమా 'వీరసింహా రెడ్డి' జనవరి 12న విడుదల కాబోతోంది. ఈ రెండు చిత్రాలు మైత్రి మూవీ మేకర్స్ నిర్మించినవే కావడం గమనార్హం.