సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్నాడట దళపతి విజయ్. అటు తమిళనాట, ఇటు తెలుగునాడులో కూడా ఇదే టాపిక్ హైలెట్ అవుతుందిప్పుడు. మరి ఈ వార్తలో నిజం ఎంత..?  

దళపతి విజయ్ తిమళనాట స్టార్ హీరో.. తెలుగులో కూడా ఆయన ఇమేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా వారసుడు సినిమాతో తెలుగు మార్కెట్ ను కూడా టార్గెట్ చేశాడు.. దాంతో తెలుగులో కూడా మార్కెట్ చాలా వచ్చింది. ఇప్పుడు లియో సినిమాకు తెలుగులో ఏకంగా 22 కోట్ల మార్కెట్ జరుగుతుంది అంటే తెలుగులో ఆయన రేంజ్ ఏ రేంజ్ ఏంటో తెలుస్తోంది. ఇక తెలుగు ఆడియన్స్ కూడా విజయ్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

ఇక ప్రస్తుతం విజయ్ లోకేశ్ కనకరాజ్ డైరెక్షన్ లో లియో సినిమాతో బిజీగా ఉన్నాడు. లియో తరువాత విజయ్ ఓ సాహసమే చేయబోతున్నాడు. విజయ్ లియో సినిమా అక్టోబర్ 20న దసరా కానుకగా రిలీజ్ అవ్వబోతోంది. దాదాపు అన్ని భాషలను టార్గెట్ చేస్తూ విజయ్ ఈసినిమా ను రిలీజ్ చేయబోతున్నాడు. అంతే కాదు ఈసారి 1000 కోట్లు వసూలు చేసేలా టార్గెట్ చేస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్ కూడా ఈ విషయం గట్టిగా నమ్ముతున్నారు. 

లియో తరువాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యాడు. అసలే వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్నాడు వెంకట్ ప్రభు. తాజాగా నాగచైతన్యతో కస్టడీ సినిమా చేసి... పెద్ద డిజాస్టర్ అందుకున్నాడు. అయినా కూడా ఆయన కథ నమ్మి.. వెంకట్ ప్రభు మీద నమ్మకంతో ముందడుగు వేస్తున్నాడు విజయ్. లియో తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 

ఇదిలా ఉంటే నెక్ట్స్ ఇయర్ విజయ్ ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. డైరెక్టర్ వెంకట్ ప్రభు సినిమా త్వరగా పూర్తి చేసి.. సినిమాలకు దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే విజయ్ ఈ మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణం కూడా ఉంది. విజయ్ రాబోయే ఎలక్షన్స్ ను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఆయన రాజకీయంలోకి ఎంట్రీ ఇవ్వడం పక్కా అని సమాచారం. అందుకే 2016లో రాబోయే ఎలక్షన్స్ ను టార్గెట్ చేసి.. విజయ్ ప్లానింగ్ చేస్తున్నారట. ర

రీసెంట్ గా ఓటు గురించి .. రాజకీయం గురించి ఓ కార్యక్రమంలో మాట్లాడారు విజయ్. డబ్బు తీసుకుని కాదు.. నిజాయితీగా ఓటు వేయాలని అంటున్నాడు.. . గత ఎన్నికల సందర్భంగా ఏ పార్టీకి ఓటేయాలని విషయంపై విజయ్ తన అభిమానులకు సూచించాడు.ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం తమిళనాట ఇంతకంటే పెద్ద సంచలనం మరొకటి ఉండదు. లియో ఇదే ఏడాది రానుంది. వెంకట్ ప్రభు సినిమా 2024 స్టార్టింగ్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. దానికి తగ్గట్టే డేట్స్ కూడా అడ్జస్ట్ చేస్తున్నాడు దళపతి. రాజకీయాలకు సబంధించిన పనులు చూసుకుని.. మళ్లీ 2027 లోనే చేయాలని చూస్తున్నాడట విజయ్.