ఇళయ దళపతి విజయ్‌ తన బర్త్ డే ట్రీట్‌ ఇచ్చాడు. పుట్టిన రోజు(జులై 22) సందర్భంగా ఫ్యాన్స్ కి ఒక రోజు ముందే అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. తన కొత్త సినిమా టైటిల్‌, ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.

ఇళయ దళపతి విజయ్‌ తన బర్త్ డే ట్రీట్‌ ఇచ్చాడు. పుట్టిన రోజు(జులై 22) సందర్భంగా ఫ్యాన్స్ కి ఒక రోజు ముందే అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. తన కొత్త సినిమా టైటిల్‌, ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. దీనికి `బీస్ట్`(మృగం) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇక విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో విజయ్‌ చేతిలో లేటెస్ట్ షార్ప్ షూటర్‌ గన్‌ పట్టుకుని ఉన్నాడు. వెనకాల టీయర్‌ గ్యాస్‌ దట్టమైన పొగలున్నాయి. ఇందులో విజయ్‌ బనియన్‌పై కనిపించడం విశేషం. 

చూడబోతే విజయ్‌ హాలీవుడ్‌ చిత్రాలైన `రాంబో` లుక్‌ని తలపిస్తున్నాడు. యాక్షన్‌ స్టార్‌ సిల్వెస్టర్‌ స్టాలోన్‌ రాంబో లుక్‌లో ఇలానే బనియన్‌తో పెద్ద మిషన్‌ గన్‌తో కనిపిస్తుంటాడు. ఏదేమైనా విజయ్‌ కొత్త సినిమా `బీస్ట్` ఫస్ట్ లుక్‌ ఫ్యాన్స్ లో గూస్‌బమ్స్ తెప్పిస్తుంది. ఇక ఈ చిత్రానికి నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులోపూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. సన్‌ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కుతుంది. ఇది విజయ్‌ 65వ చిత్రం కావడం విశేషం. 

Scroll to load tweet…
Scroll to load tweet…