Asianet News TeluguAsianet News Telugu

కేక పెట్టించింది:‘మాస్టర్‌’ తెలుగు వెర్షన్ టీజర్

విజయ్‌ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్‌ ‘మాస్టర్‌’. ఖైదీ సినిమాతో స్టార్ డైరక్టర్ గా ఎదిగిన లోకేశ్‌ కనకరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్  కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘మాస్టర్‌’ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తామని ఇప్పటికే పలు సందర్భాల్లో చిత్రవర్గాల నుంచి సమాచారం వచ్చినప్పటికీ ఓటీటీలో విడుదల చేయవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం టీమ్ తెలుగు టీజర్ ని విడుదల చేసింది.
 

Thalapathy Vijay Master Official Telugu Teaser jsp
Author
Hyderabad, First Published Dec 18, 2020, 7:12 AM IST

విజయ్‌ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్‌ ‘మాస్టర్‌’. ఖైదీ సినిమాతో స్టార్ డైరక్టర్ గా ఎదిగిన లోకేశ్‌ కనకరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్  కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘మాస్టర్‌’ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తామని ఇప్పటికే పలు సందర్భాల్లో చిత్రవర్గాల నుంచి సమాచారం వచ్చినప్పటికీ ఓటీటీలో విడుదల చేయవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం టీమ్ తెలుగు టీజర్ ని విడుదల చేసింది.

 ఇప్పటికే దీపావళి కానుకగా తమిళ టీజర్‌ను విడుదల చేస్తే యూట్యూబ్ లో రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే 45 మిలియన్‌ల వ్యూస్ సొంతం చేసుకుంది. అంతేకాదు.. మరే సినిమాకు సాధ్యం కాని 2 మిలియన్ల లైకులు ఈ సినిమాకు రావడం విశేషం.  విజయ్‌ హీరోగా, విజయ్‌ సేతుపతి విలన్ గా నటిస్తున్న చిత్రం ఇది. 

‘అది నాకూ తెలుసు సర్‌. జేడీ ఒక నేరస్థుడు. ఒక పంతులుకు ఇంత ధైర్యం యాడ్నుంచి వచ్చింది’.. అంటూ టీజర్‌ ప్రారంభమై ఆసక్తి రేపుతుంది. 1.30 నిమిషాల పాటు సాగే ఈ టీజర్‌ అభిమానులకు పండగ చేసుకునేలా ఉంది.  ఈ సినిమాలో విజయ్‌ సరసన మాళవికా మోహన్‌ నటించనుంది. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీత దర్శకులు. అర్జున్‌ దాస్, సిమ్రన్‌, ఆండ్రియా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎక్స్‌బీ ఫిల్మ్స్‌, సెవన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో చిత్రాన్ని విడుదల కానుంది.

యాక్షన్‌ తరహా కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని చిత్ర టీమ్ భావించింది. కాకపోతే, కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. త్వరలో ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా రిలీజ్‌ చేయనున్నారని ఇటీవల వార్తలు వచ్చినప్పటికీ అందులో నిజం లేదని నిర్మాతలు,టీమ్ స్పష్టం చేసింది. మరోవైపు ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios